Posts

Showing posts from March, 2021

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-37"

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-37★     మంచి కథాబలం, తారాబలంతో 'దొంగరాముడు' విడుదలై - మంచి పేరు తీసుకొచ్చింది. మొదటి చిత్రంతోనే అన్నపూర్ణా సంస్థకి పేరు, స్థిరత్వం లభించాయి కె.వి.గారు కచ్చితమైన నిర్మాణ విధానం రూపొందించడంతో, మధుసూదనరావుగారు ఆ మార్గంలో, ఆ క్రమంలో తర్వాత చిత్రనిర్మాణం చెయ్యడానికి అవకాశం కలిగింది. ఒక సినిమా విజయఢంకా మోగించిందంటే అది ఎంత ఆనందం పెంచినా అంతకంటే ఎక్కువగా బాధ్యతా పెంచుతుంది. "విజయసాధన ఎంత గొప్పదో, అంత చెడ్డది కూడా" అనిపిస్తుంది నాకు. 'రోజులు మారాయి', 'అనార్కలి', 'సంతానం' మిస్సమ్మ', 'అర్థాంగి' చిత్రాలన్నీ అఖండమైన విజయాలు సాధించాయి. ఆ కోవలో వచ్చిన 'దొంగ రాముడు' అమోఘమైన విజయం సాధించింది. ఈ విజయాలు నాకు బాధ్యత పెంచినట్టే - అన్నపూర్ణా సంస్థకూ పెంచాయి. పై చిత్రాల తర్వాత వచ్చిన భలేరాముడు', 'చరణదాసి' కూడా బాగా నడిచాయి. ఐతే, 'భలేరాముడు'లో నా పాత్ర దొంగ. నెగెటివ్ పాత్ర. అంతకుముందు సదారమ'లో దొంగ పాత్ర వెయ్యడానికి నిరాకరించినవాడిని, 'భలే రాముడు' ఎందుకు ఒప్పుక

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-36★    (దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా #అన్నపూర్ణాపిక్చర్స్ #ఆవిర్భావం) నాటకాల కాలం నుంచి దుక్కిపాటి మధుసూదనరావుగారు నా హితైషి. ఎన్నో సలహాలు శ్రద్ధగా,సూచనలూ ఇస్తూ నా అభివృద్ధికి తోడ్పడిన దైవ సమానులు, పితృతుల్యులు. ఎంతో శ్రద్ధగా క్రమశిక్షణా యుతంగా నాటకసంస్థ నడిపారు. సినిమాల మీద, కథల మీద ఎంతో అవగాహన వున్నవారు. కుటుంబ సమేతంగా సర్వ ప్రేక్షకులూ సినిమాలు చూసే విధంగా మంచి కథలతో సినిమా నిర్మాణం చెయ్యాలని ఆశపడ్డారు. నవయుగ శ్రీనివాసరావు గారితో సంప్రదించారు. వారి ఊహకు నేనూ ఊపిరి పొయ్యాలని - సంస్థ ఆరంభించాము.  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,నేను చైర్మెన్,మధుసూదనరావుగారు మేనేజింగ్ డైరక్టరు. అదే - అన్నపూర్ణాపిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ అప్పటి వరకూ నేను కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో పని చెయ్యక పోయినా, ఆయన సినిమాలు.. సినిమాలు తీసే విధానం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నిర్దోషంగా స్క్రీన్ ప్లే రాయడంలో సిద్దహస్తులు, ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యాలన్న ఆశ వున్నా - మా తొలి సినిమా ఆయన చేత చేయించుకుంటే, చిత్రనిర్మాణ విధానం, పథకాలు, ఆలోచనలూ కూడా తెలుస్తాయన

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-35

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-35★   *మధ్యలో మానేసిన సినిమా* నేను షూటింగ్ చేసి, మానేసిన సినిమా ఒకే ఒక్కటి. అది 'సదారమ'. అదీ పెద్ద సంస్థయిన ఏవియమ్ వారిది. ముందుగా పాత్ర తీరు చెప్పారు. 'దొంగ' పాత్రఅది. ఏదో కాస్త నీతి, నిజాయితీ వున్న పాత్రేమో అనుకున్నాను గాని, కాదు.మూడురోజులు షూటింగ్ చేశాను. కాని, చాలా అసంతృప్తితో చేశాను. ఆ మూడు రోజులూ చాలా అవస్థపడ్డాను. ఇక లాభం లేదని, ఏవియమ్ చెట్టియార్ గారితో చెప్పాను. "ఇలాంటి పాత్ర నేను చేస్తే సినిమా ఘోరంగా దెబ్బ తింటుంది. ఈ పాత్రలో ప్రేక్షకులు నన్ను జీర్ణం చేసుకోలేరు. కళ్లకి గంతలు కట్టుకుని ఈ దొంగ పాత్రని అభినయించలేను అన్నాను. నా అభిప్రాయం విశ్లేషించి చెప్పాను. "నా వల్ల మీకు అయిన ఖర్చు తిరిగి ఇచ్చేస్తాను. నన్ను విడిచిపెట్టేయండి" అన్నాను వినయంగా, చెట్టియార్ సినిమా జ్ఞానపండితుడు. అనుభవజ్ఞుడు. శ్రేయోభిలాషి 'ఓర్ ఇరవు' తమిళ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చారు - పేరూ వచ్చింది. కాని, నాకు పొత్తు కుదరని పాత్రతో ఎలా కాపురం చెయ్యగలను చెట్టియార్ గారు ఒప్పుకోలేదు. "నువ్వు వేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-34

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-34★   పెద్దలతో పేచీలు ఐతే దర్శకులతో పేచీలు పడిన సందర్భాలు కూడా వున్నాయి. ఆంటే - 'నా మాటే నెగ్గాలి' అని కాదు. అసంతృప్తి కలిగినప్పుడు సహజంగా పేచి వస్తుంది కదా! "పరదేశి' జరుగుతున్నప్పుడు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ గారితో చిన్న వాదన జరిగింది. ఆ సినిమాలో అంజలిదేవి గారిది సానుభూతి కలిగించే పాత్ర కాదు. నాది సింపతిటిక్ పాత్ర. ప్రసాద్ గారు ఆమెకి క్లోజప్స్ తీశారు. నిజానికి నా పాత్రకి క్లోజప్స్ అవసరం అని నా ఆభిప్రాయం. ఆయన తియ్యలేదు. షూటింగ్ అయిన తర్వాత రష్ వచ్చింది. "రష్ చూదాం రావయ్యా" అన్నారు ప్రసాద్ గారు. "నేను రాను. చూడక్కర్లేదు అన్నాను పెడసరంగా, "ఏం?" అన్నారాయన. "మీరు తీసిన విధానం నాకు నచ్చలేదు. 'రాజారాణి సినిమాలో (పరదేశికి మూలమైన హిందీ సినిమా) చూశాంగదా. సానుభూతి పొందే నా పాత్రకి క్లోజప్స్ లేకపోతే దృశ్యం ఎలా రక్తి కడుతుంది?" అని అడిగాను. తర్వాత ఆయన క్లోజప్స్ తీశారనుకోండి. నిజానికి ప్రసాద్ గారెక్కడ? నేనెక్కడ? పల్నాటియుద్ధం', 'సంసారం' సినిమాల్లో ఆయన ఎలా చెబితే అలా చేసిన వాడిని, ఇప్పుడు ఎం

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-33★

Image
  ★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-33★   సెంటిమెంటల్ పాత్రలతో తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు నిర్మించిన 'బంగారు గాజులు', 'ధర్మదాత' మంచి చిత్రాలు. 'ధర్మదాత' రసభరితమైనపాత్ర. నటనకు ప్రాధాన్యం వున్న పాత్ర. ద్విపాత్రాభినయం గల చిత్రం ఇది. చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఈ రెండూ చెప్పుకోవచ్చు. నటుడు ఒక బావిలాంటివాడు. బావిలోంచి ఎంత నీరు తోడుకుంటే అంత నీరూ వస్తుంది. అలాగే, నటుడిలో వున్న శక్తిని రాబట్టుకోగలగాలి. నటించడానికి ఎన్ని విధాల రస సిద్ధి కలిగితే, అంతగా రాణిస్తాడు నటుడు. నేను ఎప్పుడూ ఆ భిన్నత్వం కోసమే ఎదురు చూసేవాడిని. సినిమాకి కథేమిటి? ఆ కథలో నా పాత్ర ఎలాంటిది? అది కథని ఎలా నడిపిస్తుంది? ఆ పాత్రని నిర్వహించడంలో నేను చెయ్యవలసిన కృషి ఏమిటి?  ఇదే నా ఆలోచన.... ఒక సినిమాకి 'దర్శకుడు' అంటే - సినిమాలో ఉన్న అన్ని శాఖల్నీసమన్వయపరిచి, కావలసింది రాబట్టే వ్యక్తి. నటీనటులందరినీ పాత్రల పరంగా నియంత్రించే వ్యక్తి. ఆ దర్శకుడు ఎప్పుడూ సమర్థుడై వుండాలి. నేను చాలామంది సమర్థులైన దర్శకుల దగ్గర పని చేశాను కాబట్టే, నాలో నిక్షప్తమైవున్న నటనాంశాన్ని బహిరంగ పరచగలిగాను. ఐత

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-32★

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-32★  ఇంకొక మంచి పాత్ర ఎన్.టి.రామారావుగారు, నేనూ అప్పటికి కలిసి నటించిన చిత్రాలు పల్లెటూరి పిల్ల', 'సంసారం', 'మిస్సమ్మ'ల తర్వాత తెనాలి రామకృష్ణ' వచ్చింది. అందులో నన్ను రామకృష్ణ కవి వెయ్యమని బి.ఎస్.రంగా గారు అడిగినప్పుడు చిన్న సందేహం తలెత్తింది తెనాలి రామలింగడంటే వికటకవిగా ప్రసిద్ధుడు. ఏవేవో హాస్య చేష్టలు చెయ్యడం కవుల్నీ, కృష్ణదేవరాయల్నీ ఆట పట్టించడం లాంటివే ప్రచారంలో పున్నాయి. ఆ మాట అడిగితే, "అలాకాదు. చాలా పెద్ద తరహాలో ప్రవర్తించే పాత్రగా మలిచాము" అని పాత్ర తీరు చెప్పారు. విన్న తర్వాత మంచి ట్రీట్ మెంట్ ఇచ్చారనిపించింది. తన చాకచక్యంతో, రాజకీయ సమస్యల్ని కూడా పరిష్కరించే స్థాయిలో రామకృష్ణుడి పాత్రను తీర్చిదిద్దారు. సముద్రాల రాఘవాచార్యగారు నిండుదనంగల పాత్రగా, నటించడానికి అవకాశం వున్న పాత్రగా ఎంతో చక్కని సంభాషణలతో రూపొందించారు. చిత్రం విడుదలానంతరం రామకృష్ణుడి పాత్రకి సంపూర్ణత్వం వచ్చిందనీ, నేను చక్కగా అభినయించాననీ, పరిశ్రమలోని వారూ అభిమానులూ అందరూ అభినందించారు తెనాలి రామకృష్ణ' నా నట జీవితంలో ఒక మంచి

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

Image
  ★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-31★  హాస్య పాత్ర కాని హాస్యపాత్ర దేవదాసు'లాంటి బరువైన పాత్ర ధరించి 'మిస్సమ్మ'లో హాస్యాన్ని పలికించే పాత్ర చేశాను. ఈ పాత్రని నేనుగా కోరుకున్నది. ఇదొక విశేషం! వచ్చిన కొన్ని పాత్రల్ని నిరాకరించడం వేరు; నాకుగా రాని పాత్రని నేను చేస్తాననడం వేరు! 'మిస్సమ్మ' కథ తయారుచేసుకున్న తర్వాత, ఒకసందర్భంలో చక్రపాణిగారిని కలుసుకున్నాను. ఆయన సూక్ష్మంగా కథ వివరిస్తూ- "రెండో వేషం తమాషాగా వచ్చింది. డిటెక్టివ్ లాగా, డాబులు కొడుతూ తిరిగే పాత్ర. హాస్యపాత్ర కాదుగానిహాస్యం చిలికించే పాత్ర. హీరోకాడు గాని, హీరోకి సమమైన పాత్ర. ముఖ్యమైన పాత్ర. ఇది ఎవరి చేత వేయించాలా అని ఆలోచిస్తున్నాను” అన్నారు. నేను ఒక్క నిమిషం ఆలోచించి"మీకు అభ్యంతరం లేకపోతే నేను వేస్తాను" అన్నాను. చక్రపాణిగారు ఒక్క క్షణం అలావుండిపోయి "నువ్వా ..నువ్వు వేస్తావా?" అని అడిగారు ఆశ్చర్యానందాలు మిళాయించి. "అవును. అలాంటి సరళమైన పాత్ర చెయ్యాలని ఆశ. 'దేవదాసు' లాంటి బరువైన పాత్ర చేసిన తర్వాత, సరదాగా వుండే ఇలాంటి పాత్ర చేస్తే నాకో వెరైటీ అవుతుంది.

★అక్కినే "మనసులోనిమాట" నిపార్ట్-30★

Image
★అక్కినే "#మనసులోనిమాట" నిపార్ట్-30★   నిర్మాత డి.ఎల్.నారాయణ గారు 'చిరంజీవులు'చిత్రానికి నన్ను అడిగారు. రెండు ట్రాజెడీ సినిమాలు కలిపిన కథ. 'కథ అంత మంచిది కాదేమో' అన్నాను. హీరో నాకు తగిన పాత్ర కాదన్నాను. ఏ పాత్రయినా, నాకు ఉపయోగపడాలి. తర్వాత ప్రజల దృష్టిలో ఎలా వుంటాను? అని ఆలోచిస్తాను. మొత్తానికి 'చిరంజీవులు' కూడా వద్దన్నానని డి.ఎల్.గారు మండి పడ్డారు కృతఘ్నుడు. విశ్వాసంలేనివాడు" అని కూడా అన్నారు. పైగా ఈ సినిమా నేను చెయ్యనన్నానని రామారావుగారితో కూడా చెప్పారు! అది నాకు మరింత కష్టం కలిగించింది. ఐతే, నాకున్నంత ఆలోచన, నిర్మాతలకు ఉండదా? నేను వారికంటే అధికుడినా? కాదు- ఎప్పుడూ కాదు. కాని, వ్యక్తిగతంగా ఆలోచించు కున్నప్పుడు కనిపించే కారణాలు అడ్డం వస్తాయి. నేనంటే, డి.ఎల్.గారికి ఎంతో ఇష్టం! ఎంతో ప్రేమ! కాని ఇలాంటి విషయాల్లో తప్పడంలేదు. అలాగే, 'ఏకవీర' తీదాం అన్నప్పుడు కూడా నేను ఆ సినిమాలో నన్ను, రామారావుగారినీ పెట్టి తియ్యాలని ఆయన కోరిక ఒప్పుకోలేదు ఇద్దరు హీరోలతో తీస్తే స్టార్ వాల్యూ వుంటుందని, సినిమాకి బలం వస్తుందనీ చెప్పారు.కథా పరంగా నాకు ఇ

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-29★

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-29★   నటుడు ప్రేక్షకులమనిషి. ప్రజలతో ముడిపడి పున్నాడు. ఆ నటుడిని నటుడిగా చూసి జేజేలు పలికినా, తిరస్కరించినా ప్రేక్షకులే. అందుకని తన పట్ల ప్రజలకి ఉన్న ఉన్నత భావాన్ని నిలబెట్టుకోవాలి. నేను - 'దేవదాసు' సినిమాతో, నాకు లభించిన కీర్తిని తగ్గించుకోకూడదు. ఎలాంటి కథల్ని ప్రేక్షకులు ఆమోదిస్తున్నారో, ఎలాంటి పాత్రల్ని ఆదరిస్తున్నారో తెలుసుకుని అలాంటి పాత్రల్లో కనిపించాలి. అన్నీ హీరో పాత్రలే చెయ్యాలని కాదు, భిన్నమైన పాత్రల్లో కనిపించినా ప్రేక్షకులు హర్షిస్తారు. "చింతామణి'లో బిల్వమంగళుడుకీ, విప్రనారాయణుడికీ  కొంత తేడా వుంది. విప్రనారాయణ సమగ్రమైన పాత్ర. బిల్వమంగళుడు ఒక విటుడు. విప్రనారాయణకి వచ్చినంత పేరు, మళ్లీ బిల్వమంగళుడికి రాదు. పైగా భానుమతిగారి వంటి మహానటిని చింతామణిగా చూడలేరని నా ఉద్దేశం. ఇలా విశ్లేషించుకుని భరణి దంపతుల మాటని కాదనవలసివచ్చింది తొలిసారిగా, ఇలా అంగీకరించకపోవడానికి గల కారణాల్లో వాళ్లూ ఒకరే కదా నిజానికి. మంచి ప్రజలుపాత్రలిచ్చి ప్రోత్సహించారుకదా. 'విప్రనారాయణ' ఇచ్చివుండకపోతే- అది వేరే విషయం. ఐతే వారు నా శ్

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-28★

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-28★  *పెద్దల మాట తిరస్కరించాను* అద్భుతమైన పాత్రలు నాచేత చేయించిన నా శ్రేయోభిలాషులు రామకృష్ణగారు భానుమతి గార్లకు బాధ కలిగించే సందర్భం వచ్చింది. దురదృష్టకరమైన సంఘటన. నేను కొంతకాలం విశ్రాంతికని, కాశ్మీర్ వెళ్లాను, అక్కడ వుండగా నాకు రెండు లేఖలు వచ్చాయి. ఒకటి భరణి రామకృష్ణగారు, ఇంకొకటి ఆదినారాయణ రావుగారూ రాశారు. కాళ్లకూరి నారాయణరావుగారి 'చింతామణి' బాగా ప్రసిద్ది పొందిన నాటకం. అది సినిమాగా తియ్యాలని ఉద్దేశిస్తున్నాం, నువ్వు బిల్వమంగళుడు పాత్ర వెయ్యాలి అంటూ, రామకృష్ణగారు రాశారు. ఒక్కసారి దిగ్గుమని పోయాను. చింతామణి లాంటి పాత్రను భానుమతిగారు ధరించడమా! నేను బిల్వమంగళుడా! ఈ రెండు అంశాలూ నాకు నచ్చలేదు. లైలామజ్నూ, విప్రనారాయణ లాంటి చిత్రాలు అందించిన భరణి సంస్థ ఈ సినిమా తీస్తే ఏం బాగుంటుంది? భవాని శంకరుడు, సుబ్బిశెట్టి, బిల్వమంగళుడులాంటి పాత్రల మధ్య తిరిగే చింతామణి పాత్ర చెయ్యాలని భానుమతిగారికి ఎందుకు అనిపించిందో! ఏమైనా గట్టి మనసు చేసుకుని నా అభిప్రాయం రాసేశాను. 'అసలా సినిమాని మానుకోండి' అనికూడా రాశాను. ఎంతో ఆవేదనతో, బాధతో రాసినల

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-27★

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-27★   పాత్రలే ఏ నటుడికైనా నిండుదనం తెస్తాయి. నన్ను 'నట సమ్రాట్ అన్నా, 'మహానటుడు' అన్నా... సృష్టించిన రచయితలదీ, తీర్చిదిద్దిన ఎంతోమంది టెక్నీషియన్లదీ, ఎక్కడో రామాపురంలో పుట్టినవాడికి, చదువు లేనివాడికి, సంస్కారం తెలియనివాడికి, ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాల దగ్గర్నుంచి ఆహ్వానాలు వచ్చాయంటే, అదంతా నా గొప్పదనమా? నా అదృష్టం కొద్ది నేను నటుడి నయాను. అలా కాకుండా, చదువుకుని వుంటే ఏ ఉద్యోగమో చేసుకుంటూ పొట్టపోసుకునే వాడినేమో!  చదువు లేక పోవడం వల్లనే నాకు ఈ భిక్ష లభించిందా? మా అమ్మ ప్రోత్సాహంఆశీస్సులు లేకపోతే ఈ రంగంలోకి వచ్చి వుండేవాడినా? మా అన్న రామబ్రహ్మంగారుచొరవ చూపించకపోతే, ఈ రంగంలోకి వచ్చి వుండేవాడినా...!! కారణం ఆ పాత్రలే. ఆ గొప్పదనం అంతా ఆ పాత్రలది, ఆ పాత్రల్నివీడిని చదివించే స్తోమత మనకి లేదు. చదువుకోవడానికి ఇక్కడ సదుపాయాలూలేవు.ఏదో నాటకాల్లో వేషాలు వేస్తున్నాడు, బాగానేవున్నాడు, వాడికీ ఉత్సాహం వుంది, ఉండనీ, ఎలాగోఒకలా నాలుగురాళ్లు సంపా యించుకోడానికి ఒక దారి దొరికిందిగదా" అంది అమ్మ- మాఅన్నయ్యతో, అది అమ్మ ఆశీస్సు, అమ్మ

★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-26★

Image
  ★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-26★  మొత్తానికి #కృష్ణార్జునయుద్ధం'లో అర్జునుడి పాత్రే నన్ను వరించింది. రొమాంటిక్ పాత్ర పాటలున్నాయి, దర్శకుడు, రచయిత సమగ్రమైన పాత్రగా రూపొందించారు. ఐతే, చిత్రం చివరిలో అర్జునుడు, కృష్ణుడూ పోటీ పడినప్పుడు- అర్జునుడు రథం దిగి కృష్ణుడికి నమస్కరించాలి.అది ఆ పాత్ర లక్షణం, సంస్కారం. నేను కింద నిలబడ్డాను. రామారావుగారు రథంమీద వున్నారు. నేను మరీ పొట్టిగా, వున్నట్టనిపించింది. రామారావుగారికి ఎదురుగా వున్నా, పక్కన పున్నా ఆయనదే ఆకర్షణీయ రూపం. "కృష్ణార్జున యుద్ధం' చిత్రం చూసినతర్వాత, నా భార్య ఒక మాట అంది : " ఇంకెప్పుడూ రామారావుగారి పక్కన పౌరాణిక. చిత్రాలలో వెయ్యకండి!" అమె అన్నమాట నిజమే కదా! ఇంతటి సద్విమర్శ చెయ్యగల అన్నపూర్ణ నా భార్య అయినందుకు ఎంతో గర్వపడ్డాను  మళ్లీ 'విప్రనారాయణ' విషయానికి వస్తే, ఈ అగ్ని పరీక్షలో కూడా నెగ్గాలనుకున్నాను. విప్రనారాయణుడు పరమ భాగవతోత్తముడు, నిష్ణాగరిష్టుడు,శ్రీరంగనాథుడి చింత తప్ప ఐహిక వాంఛలు లేనివాడు. అలాంటివాడు దేవదేవి వేసిన ఉచ్చులో చిక్కుకున్నాడు, పాత్ర తీరులో మలుపులున్నాయి, ఘర్షణ

అక్కినేని "మనసులోని మాట" పార్ట్-25

Image
★అక్కినేని "మనసులోని మాట" పార్ట్-25★ దేవుడున్నాడా..!!?? నా దృష్టిలో "దేవుడు" అనే పదార్థం ఒక అద్భుతమైన సృష్టి .  అవును. 'పురాణ పాత్రలన్నీ సృష్టింపబడినవే- అవి జరిగినవి కావు' - అని భారత, భాగవతాలు రచించిన వ్యాసుడే చెప్పాడు "ఇతిహాస పురాణేభ్యామ్ వేదస్సముప బ్రహ్మయేత్ నరామో నవాపి కృష్ణ న సీత న చరుక్మిణి I" సామాన్య మానవులకు, మూర్ఖులకు, జ్ఞాన హీనులకు, అజ్ఞానులకు, మంచి చెడ్డలు, నీతి నీజాయితీ, ధర్మా ధర్మాలు, న్యాయాన్యాయాలు అనే విషయాలను తెలియజెప్పడానికి, ఉదాహరణగా సృష్టించబడిన పాత్రలు మాత్రమే- అని చెప్పారాయన. దైవం ప్రజల్ని భయపెడుతుంది. దైవభీతి వుండవలసిందే. 'దేవుడున్నాడు-చూస్తున్నాడు' అంటేనే - మానవులు ఇన్ని తప్పులు, నేరాలూ చేస్తున్నారే- అసలు ఆ భయంకూడా లేకుండాపోతే, ఈ మానవులు ఎలా వుండేవారో! ఏమైనా ఎవరి అభిప్రాయం వారిది. నాది చిన్నతనం నుంచి తార్కిక స్వభావం. ఏదైనా తర్కానికి నిలబడాలి. నాకెందుకో దేవుడు అనే వాడున్నాడనీ, అతను విగ్రహాల్లో వుంటాడనీ నమ్మకంలేదు. పెద్దవాళ్లకి ఆ నమ్మకాలుంటాయి. నా పెళ్లయిన తర్వాత సత్యనారాయణ వత్రం చెయ్యాలని అమ్మ చెప్పింది.అప్ప

★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-24★

Image
★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-24★  'కృష్ణార్జునయుద్ధం' లో నాకు కృష్ణుడిగా వచ్చిన అవకాశాన్ని- రామారావుగారికి వున్న పాపులారిటీ దృష్ట్యా- వద్దనుకున్నాను. అంతకుముందు 'చెంచులక్ష్మి'లో విష్ణువు వేషం వేశానుగదా...ఆ సినిమా ఘన విజయం సాధించింది కదా. ఐతే, విష్ణువు ఆజానుబాహుడని ఎక్కడాలేదు. వీరత్వం శూరత్వం, పౌరుషంగల పాత్రలకే ఆ రూపం నిర్దేశించారు. ఎప్పుడైతే- రామారావుగారు రాముడి పాత్రకీ, కృష్ణుడి పాత్రకీ అచ్చుగుద్దినట్టు సరిపోయారో- ప్రజలు ఏ పాత్రల ద్వారా ఆయన్ని అరాధిస్తున్నారో- దాన్ని వ్యతిరేకించకూడదు.అలాగే, ఎమ్.ఎ.వి. వారు తమిళంలో 'సంపూర్ణ రామాయణం' ఆరంభిస్తూ నన్ను రాముడి పాత్ర చెయ్యమని అడిగారు. నేను వెంటనే తిరస్కరించాను. "రాముడంటే రామారావుగారే. ఆయన చేతనే వేయించండి. చిత్ర విజయానికీ, ఆ పాత్రకీ ఆయనే నూటికి నూరుపాళ్లు" అని చెప్పాను.  అప్పుడు రామారావుగారే ఆ పాత్ర చేశారు సి.పుల్లయ్యగారు 'లవకుశ' ఆరంభిస్తూ ఇద్దరు హీరోలుంటే బావుంటుందని, నన్ను లక్ష్మణుడు వెయ్యమన్నారు. "లక్ష్మణుడిలో సింపతీ వుంది- మిలాంటి వాళ్లు వేస్తే సినిమాకి మేలు జరుగుతుంది”

అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-23

Image
  ★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-23★ మళ్లీ విమర్శలు వినోదాత్మకమైన చిత్రంగా భరణివారు'చక్రసాణి' తీశారు. అది బాగానే నడిచిన తర్వాత, 'విప్రనారాయణ ప్రారంభించాలని, ఆ పాత్రను నాకివ్వాలనీ తీర్మానం చేసుకున్నారు. నేను ఎంతో సంతోషించాను. మళ్లీ మరొక సవాల్ ఎదురైందన్నమాట. మొదటిసారిగా నేను ధరిస్తున్న ఒక బ్రాహ్మణ పాత్ర. భక్తుడి పాత్ర మళ్లీ విమర్శనాత్మకమైన మేఘాలు కమ్ముకున్నాయి. “ఏదో 'దేవదాసు' చేసి గట్టెక్కాడు. 'విప్రనారాయణ' అలాంటిది కాదు. ఇది ఎలా చెయ్యగలడు?"అన్న   ఊహాగానాలు వినిపించాయి. “నీకు దైవభక్తి లేదు. నువ్వు భక్తుడివి కావు విప్రనారాయణుడు గొప్ప భక్తుడు. ఆ పాత్ర నువ్వు ఎలా చేస్తావు?" అని కె.వి.రెడ్డిగారే అడిగారు నన్ను. నేను మొండిగా వాదించాను. నటుడన్న వాడు ఏదైనా నటించాలి గదా భక్తి లేకపోతే భక్తుడిగా నటించలేడా? తాగుబోతు పాత్ర వేసినవాడు, తాగుబోతయివుండాలా? తను కానిదాన్ని, తనలో లేనిదాన్నీ ఊహించుకుని ఆ పాత్ర నిర్వహించడమేకదా, నటన అంటే కొందరు భానుమతి గారితోనూ రామకృష్ణ గారితోనూ నేను విప్రనారాయణ పాత్రకి పనికి రానేమో - అని చెప్పారు. నాతో కూడా చెప్పారు.

అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-22

Image
  ★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-22★ అంతకు ముందు హిందీలో వచ్చిన కె.ఎల్.సైగల్ 'దేవదాసు నేను చూడలేదు. "ఆ పాత్రని ఎలా రూపొందించారో చూద్దామా?" అని అడిగితే, “వద్దు, నువ్వు చేసేది నువ్వు చెయ్యి. ఆ సినిమా చూడొద్దు" అన్నారు డి.ఎల్. 'దేవదాసు' విడదలయిపోయిన తర్వాత ఎప్పుడో సైగల్ సినిమా చూశాను, దిలీప్ కుమార్ నటించినదీ చూశాను. వాళ్లు మార్పులు చెయ్యలేదు. నవలని యథాతథంగానే తీశారు దేవదాసు' 1953 జూన్ 26న విడుదలై, పెద్ద సంచలనం తెచ్చింది. పండితులు, పామరులూ అంతా మెచ్చుకున్నారు. సినిమాకి ఎంత పేరొచ్చిందో అంతపేరు నాకూ వచ్చింది. సావిత్రికీ వచ్చింది ప్రారంభానికి ముందు ముక్కున వేలేసుకున్న పరిశ్రమ - సినిమాగా ప్రేక్షకలోకంలోకి వెళ్లిన తర్వాత ఆ ఘన విజయం చూసి మరోసారి ముక్కున వేలేసుకుంది! పరిశ్రమనే ఒక మలుపు తిప్పిన ఆ సినిమా నా నటజీవితాన్ని కూడా ఒక మలుపు తిప్పింది. నాకు మంచి పేరు తెచ్చింది. అందరి కృషి ఫలించింది. 'క్లాసిక్' అనిపించుకున్న 'దేవదాసు' 'మాస్'ని కూడా ఆకట్టుకుంది. ఎన్నో ఉత్సవాలు సత్కారాలు, సన్మానాలూ జరిగాయి. తమిళంలో కూడా అంత విజయం సాధ

అక్కినేని"మనసులోని మాట"పార్ట్-

Image
  ★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-21   దేవదాసు  సినిమాలో తాగుడు దృశ్యాల్లో నేను తిండి మానేసి, కళ్లు లోతు చేసుకుని నటించానని కొందరు భావించారు. అదేమి కాదు. నా సూచన మీదనే, ఆ దృశ్యాలన్నీ రాత్రులు షూట్ చేశారు. రాత్రి బాగా పెరుగు అన్నం తిని, నిద్ర మత్తును తట్టుకుంటూ అరమోడ్పు కళ్లతో నటించడం వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చింది. తాగుడుకి బాగా బానిసయిపోయిన తర్వాత మంగయ్యగారు చేసిన మేకప్, రంగాగారి లైటింగ్ ఎంతో సహకరించాయి. మంగయ్యగారు చేతి వేళ్లకు కూడా మేకప్ చేశారు దేవదాసు బలహీనుడు. సాహసికాడు, మానసిక వ్యధ అనుభవించే నాయకుడు పార్వతి, చంద్రముఖి మంచి పాత్రలు. ఐతే 'దేవదాసు' మూలకథలో వున్నట్టుగా కాకుండా, సినిమాకి చిన్న మార్పులు చేశారు. నవలలో పార్వతి, దేవదాసులు బాహాటంగా ప్రేమించుకోలేదు. ఒకరికొకరు చెప్పుకోలేదు. కాని, సినిమాలో ప్రేమికులుగానే చూపించారు. ఒక సన్నివేశంలో పార్వతితో "ఉన్న సిగ్గు అంతా ఇప్పుడే పడిపోతే మరిపెళ్లినాడో?" అంటాడు దేవదాసు. అప్పుడు నేను డి.ఎల్.గారిని అడిగాను - "మూలకథలో ఇలా లేదు కదా ఎందుకీ మార్పు చేశారు?" అని. “వాళ్లకి ఒకరి మీద ఒకరికి ప్రేమ వుంది. ఉందని ప

అక్కినేని సోదరులు

Image
  అక్కినేని వారి పెద్దన్నయ్య రామబ్రహ్మం...వీరు తరువాత కాలంలో నూజివీడు మామిడి తోటలోహత్యగావించబడ్డారు. మరో అన్నయ్య మల్లికార్జునరావు  మల్లికార్జునరావు గారికి1961 లో ,,విజయవాడ రోడ్డులో ప్లై ఓవర్ ఎంట్రన్స్ లో  ఇప్పటి బ్రహ్మ థియేటర్  ఎదురుగా ఇప్పుడున్న jio షో రూమ్ లో ఆనాడు నాగేశ్వర లారీ సప్లై ఆఫీస్ ఉండేది..25 కీ డాడ్జ్ లారీలు వుండేవి... వీరి అబ్బాయ్ పూలరంగడు నాటిక హీరో అక్కినేని వెంకటరత్నం.బి.ఎన్. సూరి... ప్రసాద్...తో కలిసి. ఆ నాటికను వేల ప్రదర్శనలు ఇచ్చారు..  .     -నూలు

అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-20

Image
  ★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-20★  నేను ఎగిరిగంతేసిన వార్త..!!  డి.ఎల్.గారు #దేవదాసు తీస్తానన్నారు. అజరామరమైనఆ పాత్రను నాకిస్తామన్నారు. సావిత్రి పార్వతి. దర్శకుడు వేదాంతం రాఘవయ్య. అంతే సినిమాలోకం అంతా కాకుల్లా కూసింది... !! అందరూ ముక్కున వేలేసుకున్నారు. పరిశ్రమలో పెద్ద దుమారం లేచి గాలివాన వీచినట్టయింది. నాగేశ్వరరావు దేవదాసా..? పార్వతి పాత్ర సావిత్రా..? జానపదాలు తీసుకునే వేదాంతం రాఘవయ్య 'దేవదాసు'ను డైరక్టు చేస్తారా దీంతో వినోదా సంస్థ, డి.ఎల్ గారు, అందరూ కొట్టుకుపోడం ఖాయం..! - ఇదీ పరిశ్రమలో స్పందన... వేళాకోళాలు, వెక్కిరింతలూ మొదలైనాయి. ఇవన్నీ మా అందరికీ తెలిశాయి ఏమైనా సరే .., 'దేవదాసు' తీద్దాం, కష్టపడదాం ., కృషి చేద్దాం" అని పట్టుబట్టారు. డి.ఎల్.గారు. కొందరు ప్రోత్సహించినా, కొందరు మాత్రం "దేవదాసు' ట్రాజడీ. హీరో హీరోయిన్లిద్దరూ చ్చిపోతే ఎవరు చూస్తారు? విషాదమైన కథ ఎవరిక్కావాలి?" అన్నారు చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు కూడా "ఆ బరువు నువ్వు మొయ్యలేవు చిరంజీవీ అన్నారు నాతో. బి.ఎన్.రెడ్డిగారు మాత్రం - "చాలా మానసి

అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-19

Image
  ★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-19★  నటుడు కేవలం తన నటన, తను నటిస్తున్న పాత్ర మాత్రమే కాకుండా, లౌకిక విషయాలు, ప్రాపంచిక రీతులు, శాస్త్రజ్ఞానం వంటి వెన్నో తెలుసుకోవాలని, ఆ జిజ్ఞాస బాగా అవసరమనీ క్రమేణా తెలుసుకోగలిగాను. పాత్రధారణ చేసే వారికి ఇవన్నీ ఏం అవసరం? అని ప్రశ్నించుకోడానికి వీల్లేదు. వాటిలోంచే పాత్రలు పుట్టాయి. ప్రతి పాత్రకీ సమాజంతో సంబంధం వుంటుంది. రామాయణ, మహాభారత కథలు తెలుసుకున్నాను. తెలుగులో వచ్చిన మంచి సాహిత్యం చదువుకున్నాను. పాత్రలు వాటి మనస్తత్వాలు, విశ్లేషణ బాగా తెలియాలంటే, శరత్ సాహిత్యం చదవమని కె.వి.రెడ్డిగారు చెప్పారొక సారి. #సముద్రాలరాఘవాచార్యగారు (చిత్రంలో) ఆ పుస్తకాలు తెప్పించినాకిచ్చారు. వీలు కల్పించుకుని చదివాను.  అప్పుడే 'దేవదాసు' చదివాను. 'దేవదాసు పాత్రని విశ్లేషించుకున్నాను కూడా. ఇది ఎవరైనా సినిమాతీస్తే?- ఏదో ఆలోచన......... బ్రతుకు తెరువు' మంచికథ, మంచి సినిమా. సంఘర్షణ గల పాత్ర నాది వయ్యారి భామ'లో ఎందుకు నటించారు? అని అడిగారు అప్పుడు. కథ ఇలావుంటుందని చెప్పారు. వద్దనుకున్నాను. కాని, ఆ చిత్రనిర్మాత సుబ్బారావుగారి భార్య సులోచ

అక్కినేని మనసులోనిమాట పార్ట్-18

Image
  ★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-18★  పెద్దల ఆదేశాలు అప్పుడు చాలా సినిమాలు రెండు భాషల్లోనూ తయారయేవి. "కీలుగుర్రం" తమిళంలోకి డబ్చేస్తే ఘన విజయం సాధించడంతో, నేను తమిళ ప్రేక్షకులకి బాగా- తెలిశాను.భరణీ వారి "#లైలామజ్నూ'తో (డబ్బింగ్) ఇంకా బాగా తెలిశాను. అటు తర్వాత రెండుభాషల్లోనూ ఏక కాలంలో చిత్రాలు తీసినప్పుడు రెండింట్లోనూ నేనే హీరోని. అప్పుడే క్షుణ్ణంగా తమిళం నేర్చుకున్నాను. నేను నటించిన తమిళ చిత్రాల్లో నేనే మాట్లాడానుగాని, నాకు డబ్బింగ్ లేదు. తమిళదేశంలో కూడా నాకు పేరుందని, నాతో తమిళచిత్రాలే తీశారు. అలా తెలుగు లేకుండా, తమిళంలో మాత్రమే తీసిన చిత్రాలు  'ఓర్ ఇరవు', 'అన్బుమగళ్', 'అతిశయ పెణ్', 'దైవమేతునై', 'ఎంగళ్ సెల్వి', "పెణ్మనం* మొదలైనవి. వీటిలో కొన్నింటిని దరిమిలా తెలుగులోకి డబ్ చేశారు. నేను తమిళం నేర్చుకున్నట్టే ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాను. బి.ఎన్.రెడ్డిగారు నన్ను ఎంతో ఆదరించేవారు. నువ్వు నటుడిగా ఎదుగుతున్నావు. పదిమందినీ కలుసుకునే అవకాశాలు వస్తాయి. అంచేత,ఇంగ్లీషునేర్చుకో, ఇంగ్లీషులో మాట్లాడ్డం నేర్చుకో&q

అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-17

Image
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-17 ★   సంసారం'లో నా వేషం బాగుందనీ, నేను బాగా చేశాననీ చాలామంది ప్రశంసించినా, నేనూ తృప్తిపడినా  వెంటనే ఏ సాంఘిక చిత్రంలోనూ అవకాశం రాలేదు మళ్లీ 'తిలోత్తమ', 'సౌదామిని', 'మాయలమారి', 'స్త్రీ సాహసం', 'మంత్రదండం' లాంటి జానపదాలే వచ్చాయి వీటిలో 'సౌదామిని', 'మాయలమారి', 'స్త్రీ సాహసం' తమిళంలోకూడా వచ్చాయి. 'సౌదామిని' కడారు నాగభూషణంగారు తీశారు. మంచి నిర్మాతగా ఆయనకు పేరుంది. చాలాకాలంగా తెలిసిన వారు. అంచేత, ఆయన అడిగారని సౌదామిని'లో చేశాను ఒక్కోసారి ఏ మొహమాటానికో, ఎవరికోసమో, ఎవరో గట్టిగా చెప్పడం వల్లనో కొన్ని కొన్ని ఒప్పుకోవలసి వస్తుంది. అలా ఒప్పుకున్నదే 'మంత్రదండం', అది ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచింది. అంజలీదేవిగారు, మేకప్ ఆర్టిస్ట్ గోపాలరావుగారు, నేనూ అలా కొందరం కలిసి ఒక సినిమా తీద్దాం అనుకున్నాం గనక, 'మాయలమారి'లో నటించాను స్త్రీ సాహసం' వినోదావారిది. డి.ఎల్.గారు అధినేత. ఈ సంస్థలోని భాగస్వాములందరూ నా శ్రేయోభిలాషులే. వేదాంతం రాఘవయ్యగారు,సముద్రాలగారు,

అక్కినేని నటజీవిత మార్గదర్శకులు..

Image
అక్కినేని నటజీవిత మార్గదర్శకులు.. 1.దుక్కిపాటి మధుసూదనరావు. ముదినేపల్లి 2.ఘంటసాల బలరామయ్య  3.చల్లపల్లి రాజాశ్రీ యార్లగడ్డ అంకినీడుప్రసాద్ .. 4.మీర్జాపురం రాజావారు..నూజివీడు 5.గూడవల్లి రామబ్రహ్మం...నందమూరు 6. కోడూరి అచ్చయ్య చౌదరి.ముదినేపల్లి 7.పోలవరపు సూర్యప్రకాశరావు.గుడివాడ 8 కోనేరు కుటుంబరావు.గుడివాడ (ఈ క్రిందివారి ఫొటోలు లభించలేదు..) 9.అక్కినేనిని సినిమా నటుని చేయాలని తపించి అక్కినేని 10.పెద్దన్నయ్య..రామబ్రహ్మం..గుడివాడ 11. శ్రీనివాసమహల్ ప్రోప్రయటర్ శ్రీ కాజ వెంకట్రామయ్య..గుడివాడ 12.హార్మోనిస్టు..మోటూరి వీరరాఘవయ్య...గుడివాడ 13.హార్మోనిస్టు..బుద్దిరాజు శ్రీరామమూర్తి..గుడివాడ 14.వై.భద్రాచార్యులు..గుడివాడ 15.నాటక మేకప్ మాన్.. మంగయ్య.గుడివాడ తదితరులు..

అక్కినేని మనసులోనిమాట పార్ట్-16

Image
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-16★   మొదటి సాంఘికం ఆ నిరీక్షణలో 'సంసారం' వచ్చింది. నేను సంతోషంచినా, నన్ను వెంటాడే ఆ సమస్య మాత్రం వూరుకోలేదు. మళ్లీ చాలామందికి సందేహాోలు మొదలైనాయి. "జానపదాల్లో వేసే వాడు సాంఘికాలకేం పనికొస్తాడు?" అన్నారు. నా మీద నాకే అనుమానం వచ్చేలా పరిశ్రమలో మాటలు వినిపించాయి. ఎదురవుతున్న నిరుత్సాహాన్ని పక్కకితోసేసినా, సాంఘిక పాత్రకి తగ్గట్టు దుస్తులువేసుకుని, మేకప్ వేసుకుని, స్టిల్స్ తీయించుకున్నాను నిలువుటద్దం ముందు నిలబడి, సాంఘిక పరమైన సంభాషణలు చెప్పి చూసుకున్నాను. ఆత్మవిశ్వాసం,మనోబలం వుంటే, ఆ భయాలన్నీ పారిపోతాయని రూఢి చేసుకున్నాను. 'సంసారం' నిర్మాతలు పారితోషికం తక్కువ ఇస్తానన్నా పర్వాలేదనుకునిఈ సాంఘిక పాత్రతో ప్రజల ముందు నిలబడ్డానికి పట్టుదల పట్టాను: సాంఘింక చిత్రంలోనూ నటించగలనని నిరూపించాలనుకున్నాను ఆ పాత్ర పల్లెటూరి బైతు పాత్ర. అమాయకమైన స్వభావం. 'తస్సదియ్య' అని ఒకవూతపదం కూడా వుంది. 'సంసారం' దర్శకుడు యల్.వి.ప్రసాద్ గారు సహజంగా నటుడు గనక, ఆపాత్ర తీరుతెన్నులు, ప్రవర్తన అన్నీ వివరంగా చెప్పారు. పాత్రని కాస

★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-15

Image
  ★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-15★   'బాలరాజు" సినిమా అంతకుముందున్న కొన్ని చిత్రాల వసూళ్లని అధిగమించింది. సంవత్సరం తర్వాత 'కీలుగుర్రం' వచ్చింది. ఇందులో నాది రాకుమారుడి పాత్ర, సాహసాలు వున్నాయి. శృంగారం వుంది. మాయలు, మంత్రాలు, భూతాలూ అన్నీ వున్నాయి. ఇది కూడా ఘనవిజయం సాధించింది. 'కీలుగుర్రం' చిత్రానికి లభించిన ప్రజాదరణని పురస్కరించుకుని తమిళంలోకి 'డబ్' చేస్తే అక్కడ కూడా శతదినోత్సవాలు చేసుకుంది. తమిళంలోకి 'డబ్' చెయ్యబడిన తొలి తెలుగు చిత్రం 'కీలుగుర్రం', ఆ చిత్రం శతదినోత్సవానికి వెళ్లి 'షీల్డ్' అందుకోడంలో ఎంతో ఆనందం పొందాను. ఈ రెండు జానపదాలూ మారు మూలగ్రామాల్లో వున్న పామర జనాన్ని కూడా అమితంగా ఆకర్షించాయి. వరసగా వచ్చిన రెండు సినిమాలూ అమితమైన విజయాన్ని సాధించడంతో- ఎక్కడెక్కడో వున్న పల్లె ప్రజానీకానికి కూడా 'అక్కినేని నాగేశ్వరరావు బాగా తెలిశాడు. జానపద చిత్రాల నాయకుడిగా నేను ప్రజా హృదయాల్లోస్థిరనివాసం సంపాదించుకో గలగడానికి ఈ సినిమాలు రెండూ ఎంతో దోహదం చేశాయి ఏ నటుడి విజయమైనా- అది ఆ సినిమా పొందిన విజయమే. ఎంత గొప్

అక్కినేని"మనసులోని మాట"పార్ట్-14★

Image
  ★అక్కినేని"మనసులోని మాట"పార్ట్-14★   మహోన్నత రెండు చిత్రాల ఘన విజయం 48-49 సంవత్సరాల్లో - నా అదృష్టం - నేను ప్రధాన పాత్రలు ధరించినరెండు సినిమాలూ ఘన విజయం సాధించాయి. 'బాలరాజు', 'కీలుగుర్రం', 'బాలరాజు'కిముందు 'ముగ్గురు మరాటిలు', పల్నాటియుద్ధం' వచ్చాయి. ఈ రెండు సినిమాల్లోనూనావి ముఖ్యపాత్రలే గాని, ప్రధాన పాత్రలు కావు. రెండు పాత్రల్లోనూ వీర లక్షణాలున్నాయి బాలచంద్రుడు - వీరకిశోరం. శృంగారం, పౌరుషం వున్న పాత్ర. గూడవల్లి రామబ్రహ్మంగారు స్క్రీప్టు తిర్చిదిద్దారు. బాలచంద్రుడు, మాంచాల వున్న సన్నివేశాలు మాత్రం ఆయన షూట్ చేశారు. తర్వాత ఆరోగ్యం బాగులేకుండా పోయింది అంతవరకూ నేను వారి ఇంట్లోనే వుండేవాడిని. "నువ్వు నాకు సేవ చేస్తూ ఇక్కడే వుండడం కాదు. వేరే ఇల్లు తీసుకుని వెళ్లు. నటన మీద శ్రద్ధ పెట్టు" అన్నారు రామబ్రహ్మంగారు. అప్పుడు నేను ఎల్దామ్స్ రోడ్డులోని చిన్న ఇంటికి మారాను. వీలున్నప్పుడల్లా వెళ్లి ఆయన్ని చూస్తూ, చెయ్యవలసిన సేవ చేస్తూ వచ్చాను. "జాతస్య మరణం ధ్రువం" అని పెద్దలు చెప్పినట్టుగా, ఆ అమృతమూర్తి పరలోకం వెళ్లిపోయారు.

అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-13

Image
★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-13★   #మహోన్నతమైన #పాత్రలిచ్చిన '#భరణి' భానుమతిగారు, రామకృష్ణగారు - వారి అబ్బాయి భరణి పేరు మీద సంస్థ ఆరంభించి 'రత్నమాల' తీశారు. అందులో మంత్రి కుమారుడి పాత్ర వుంది. ఆ కంపెనీకి యల్. నారాయణగారే మేనేజరు. ఆయన రామబ్రహ్మంగారి దగ్గర కొచ్చి మంత్రి కుమారుడి పాత్ర నాచేత వేయించాలని అనుకుంటున్నారనీ, అందుకు అనుమతి ఇమ్మనీ అడిగారు. "నా అనుమతి ఎందుకు? తప్పకుండా వేయించండి. పెద్దవాళ్లతో పరిచయం అవుతుంది. అనుభవం వస్తుంది” అని, ఆ మాటే నాతో చెప్పారు. నేను సంతోషించాను. కథలో ఒక అందమైన ముఖం గల పటం నాయికకు చూపించి, కత్తితో వివాహం చేస్తారు. నిజానికి అతను వరుడు కాడు. శోభన మందిరంలో ఆ మాట చెబుతాడు. ఐతే, ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగులుఏదో,నిలబడిఅప్పజెప్పినట్టున్నాయని, అప్పుడు పత్రికలు రాశాయి. కావచ్చు, అంతకంటె నటించడానికి అవకాశం లేదు. పాత్రస్వభావమే అంత. జరిగిన విషయం రాజకుమార్తెకు చెప్పడంలో అలాఅప్పజెప్పినట్టుగా వుండివుండొచ్చు, ఏదిఏమైనా, ఇలాంటి విమర్శలే, పాఠాలుఅవుతాయి. తొలి నుంచి నేను విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకున్నాను. నావ్యక్తిత్వ జీవితా