అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-35

★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-35★  
*మధ్యలో మానేసిన సినిమా*
నేను షూటింగ్ చేసి, మానేసిన సినిమా ఒకే ఒక్కటి. అది 'సదారమ'. అదీ పెద్ద సంస్థయిన ఏవియమ్ వారిది. ముందుగా పాత్ర తీరు చెప్పారు. 'దొంగ' పాత్రఅది. ఏదో కాస్త నీతి, నిజాయితీ వున్న పాత్రేమో అనుకున్నాను గాని, కాదు.మూడురోజులు షూటింగ్ చేశాను. కాని, చాలా అసంతృప్తితో చేశాను. ఆ మూడు రోజులూ చాలా అవస్థపడ్డాను. ఇక లాభం లేదని, ఏవియమ్ చెట్టియార్ గారితో చెప్పాను. "ఇలాంటి పాత్ర నేను చేస్తే సినిమా ఘోరంగా దెబ్బ తింటుంది. ఈ పాత్రలో ప్రేక్షకులు నన్ను జీర్ణం చేసుకోలేరు. కళ్లకి గంతలు కట్టుకుని ఈ దొంగ పాత్రని అభినయించలేను అన్నాను. నా అభిప్రాయం విశ్లేషించి చెప్పాను. "నా వల్ల మీకు అయిన ఖర్చు తిరిగి ఇచ్చేస్తాను. నన్ను విడిచిపెట్టేయండి" అన్నాను వినయంగా, చెట్టియార్ సినిమా జ్ఞానపండితుడు. అనుభవజ్ఞుడు. శ్రేయోభిలాషి 'ఓర్ ఇరవు' తమిళ చిత్రంలో నాకు మంచి
పాత్ర ఇచ్చారు - పేరూ వచ్చింది. కాని, నాకు పొత్తు కుదరని పాత్రతో ఎలా కాపురం చెయ్యగలను
చెట్టియార్ గారు ఒప్పుకోలేదు. "నువ్వు వేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్ల తో చెప్పాను.
పోస్టర్స్ కూడా ప్రింటు చేస్తున్నాం. నువ్వు చేస్తే నీకో వెరైటీ అవుతుందనుకున్నాం అన్నారు ఏవియమ్.  నేను అసంతృప్తితో, నిరుత్సాహపడిపోయాను. ఈ విషయం చక్రపాణిగారితో వివరంగా చెప్పాను, నేను చేస్తున్నది తప్పో రైటో చెప్పమని అడిగాను
నిజమేలే, అయిష్టంగా ఏం చేస్తావు?' అన్నారాయన. ఆయనే చెట్టియార్ గారికి ఫోన్ చేసి చెప్పారు - "ఆడు చెయ్యడు లెండి. మొండిఘటం. పట్టుదల గలాడు. వదిలేయండి" మర్నాడు ఏవియమ్ నాకు ఇచ్చిన డబ్బు తీసుకెళ్లి ఇచ్చేశాను. ఆయన పెద్దమనసుతో నన్ను అర్థం చేసుకున్నారు. "సరేలే. నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు, నష్టం భరించనక్కర్లేదుగాని- నీకు తగిన వేషం వస్తే అడుగుతాను. అప్పుడు మాత్రం తప్పకుండా చెయ్యి" అన్నారు. తర్వాత 'భూకైలాస్'లో మంచిపాత్ర' వెయ్యమని అడిగారు నారదుడు రామారావుగారు రావణుడు వేస్తున్నారని చెప్పారు
అలాగే' అని, నారదుడి పాత్ర చేశాను 'సదారమ'కి ఇచ్చిన ఆ పదకొండు వేల రూపాయలతోనే సర్దుకున్నాను. నారదుడు పాత్ర - నిండుగా వచ్చింది.నాకూ, చిత్రానికి మంచి పేరొచ్చింది
పెద్దవాళ్లతో పేచీలు, గొడవలూ వచ్చినా - అవి అలా సర్దుబాటు అవుతూ వచ్చాయి. మహా సాగరం లాంటి ఒక రంగంలో వున్నప్పుడు ఆటుపోట్లు తప్పవు.
ఐతే ఎల్లకాలం నేను అందరికీ కృతజ్ఞుడినే.. మేకప్ మేన్ గా ప్రసిద్ధిచెందిన గోపాలరావుగారు
'మాయలమారి' నిర్మించినప్పుడు ఆ కంపెనీలో నేను భాగస్వామ్యం తీసుకున్నాను. అదొక చిన్న అనుభవం.
                   ★చిత్రంలో చిత్రాలు★
ఎడమవైపు పైన:నిర్మాత ఏ.వి.ఎమ్ చెట్టియార్
కుడివైపు పైన: నిర్మాత చక్రపాణి
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'