★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

 
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-31★ 
హాస్య పాత్ర కాని హాస్యపాత్ర

దేవదాసు'లాంటి బరువైన పాత్ర ధరించి 'మిస్సమ్మ'లో హాస్యాన్ని పలికించే పాత్ర చేశాను.
ఈ పాత్రని నేనుగా కోరుకున్నది. ఇదొక విశేషం! వచ్చిన కొన్ని పాత్రల్ని నిరాకరించడం వేరు;
నాకుగా రాని పాత్రని నేను చేస్తాననడం వేరు! 'మిస్సమ్మ' కథ తయారుచేసుకున్న తర్వాత, ఒకసందర్భంలో చక్రపాణిగారిని కలుసుకున్నాను. ఆయన సూక్ష్మంగా కథ వివరిస్తూ- "రెండో వేషం తమాషాగా వచ్చింది. డిటెక్టివ్ లాగా, డాబులు కొడుతూ తిరిగే పాత్ర. హాస్యపాత్ర కాదుగానిహాస్యం చిలికించే పాత్ర. హీరోకాడు గాని, హీరోకి సమమైన పాత్ర. ముఖ్యమైన పాత్ర. ఇది ఎవరి చేత వేయించాలా అని ఆలోచిస్తున్నాను” అన్నారు. నేను ఒక్క నిమిషం ఆలోచించి"మీకు
అభ్యంతరం లేకపోతే నేను వేస్తాను" అన్నాను. చక్రపాణిగారు ఒక్క క్షణం అలావుండిపోయి "నువ్వా ..నువ్వు వేస్తావా?" అని అడిగారు ఆశ్చర్యానందాలు మిళాయించి. "అవును. అలాంటి సరళమైన పాత్ర చెయ్యాలని ఆశ. 'దేవదాసు' లాంటి బరువైన పాత్ర చేసిన తర్వాత, సరదాగా వుండే ఇలాంటి పాత్ర చేస్తే నాకో వెరైటీ అవుతుంది. దీని తర్వాత 'అర్థాంగి' వస్తుంది. అదొక భిన్నమైన పాత్ర కదా
అన్నాను.
ఓ! తప్పకుండా వెయ్యి. అంతకంటేనా - నువ్వు వేస్తే బాగా రాణిస్తుంది" అన్నారు
చక్రపాణిగారు. అలా 'మిస్సమ్మ'లో హాస్యరీతిలో సాగే ఆ డిటెక్టివ్ వేషం వేశాను. ఎంత గొప్ప పాత్ర సృష్టించారు ఆయన ! నాగిరెడ్డిగారు, చక్రపాణిగారు విజయా సంస్థ ఆరంభించిన తర్వాత నేను వేషం వెయ్యడం అది మొదటిసారి. వాణి మహాల్ లో జరిగిన నా పెళ్లి రిసెప్షన్ లో నాగిరెడ్డిగారు నాకు ఒక వెండి ఫ్లాస్క్ బహూకరించారు, "మేము చిత్ర నిర్మాణం ఆరంభించాము. మా పిక్చర్లో పనిచేస్తావా ఎప్పుడైనా?" అని అడిగారు. "అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను" అన్నాను ఆనందంగా.అవకాశంఇప్పుడొచ్చింది.వాళ్లుగా అడగలేదు. నేనే వేస్తానన్నాను. ఎంతో సౌలభ్యంతో, సరదాగా చేసిన ఆ డిటెక్టివ్ పాత్రకి మంచి పేరొచ్చింది. అంతకుముందు చేసిన భరణి వారి 'చక్రపాణి'లో కూడా హాస్యరసం వుంది. 'మిస్సమ్మ' పెద్ద హిట్టయింది. నాకో ప్లస్ ఫా యింటయింది
ఒక 'దేవదాసు', ఒక 'విప్రనారాయణ', ఒక 'మిస్పమ్మ', ఒక 'అర్థాంగి', నాలుగూ
నాలుగు భిన్నతత్వాలతో వున్న పాత్రలు, నాలుగు పాత్రల్లోనూ నేను రాణించగలగడం
నా అదృష్టం. నటుడన్నవాడికి అంతకంటే ఘనత ఇంకే కావాలి? డ్యూయట్లు పాడుతూ
అమ్మాయిల్ని ప్రేమించే పాత్రలు ఎప్పుడూ వుంటాయి. వాటిలోనూ, ఒక భిన్నమైన
పాత్రలు వున్నప్పుడు అవి సజీవమవుతాయి.
                   సశేషం...
                 -అక్కినేని
★చిత్రంలో చిత్రాలు★
ఎడమవైపు: నాగిరెడ్డి
కుడివైపు: చక్రపాణి

(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'