Posts

Showing posts from February, 2021

★అక్కినేని"మనసులోని మాట"పార్ట్ -10★

Image
★అక్కినేని"మనసులోని మాట"పార్ట్ -10★  #రామబ్రహ్మంగారు సరదాకి తమాషాలు చేస్తూ నన్ను ఆటపట్టించే వారు.అప్పుడు డిస్ట్రీబ్యూటర్లు దగ్గరనుంచి ప్రతి నెలా కొంత డబ్బు వస్తుండేది. ఒక్కోసారి కాస్త ఆలస్యమయేది. అప్పుడు రామబ్రహ్మంగారు "ఒరే షావుకారూ - ఓ రెండు వేలు ఇవ్వరా....అనేవారు.  నేను బాంక్లో దాచుకున్న డబ్బులోంచి, రెండువేలకు చెక్కు రాసి ఇచ్చే వాడిని ఎంత అనందపడే వాడినో! నేను చెక్కురాసి ఇచ్చానని. అప్పట్లో ఆఫీసు జీతాలు 200, 300 అలా వుండేవి.ఆ తర్వాత డబ్బు రాగానే నాకు తిరిగి ఇచ్చేసేవారు. ఎంత ఆప్యాయత! ఎంత చనువు అలాగే మధుసూదనరావు గారు నా మీద 'డేగ కన్ను' వేసి వుంచేవారు. అభివృద్దిలోకి రావలసిన కుర్రాడిని గనక, ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు చెబుతూ వుండేవారు. ఓ కంటితో నన్ను కనిపెట్టమని, లంక సత్యం గారికి అప్పజెప్పారు. ఇలాంటి కట్టుదిట్టాల మధ్య, నా బాగోగులు చూస్తూ నా అభివృద్ధి కాంక్షించారు పెద్దలు. క్రమశిక్షణకీ, ఒక విధానానికీ కట్టుబడి వుండాలని, అవే భావి జీవితాన్ని రక్షిస్తాయనీ, అందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయనీ నిదానంగా తెలుసుకున్నాను. మనం పెరిగే వాతావరణం, మెసిలే పరిసరాలు, మనుషులవ్యక్త

★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -9★

Image
★అక్కినేని "మనసులోని మాట"  పార్ట్ -9★ ఇంకొక #పితృతుల్యులు #రామబ్రహ్మంగారు : గూడవల్లి రామబ్రహ్మంగారు, 'మాయలోకం' పేరుతో జానపదం అరంభిస్తున్నారు. అందులో రాకుమారుడి పాత్ర వుంది. 'సీతారామజననం'లోకొత్తకుర్రాడు, రాముడు వేషం వేస్తున్నాడని విని ఆయనవున్నాడు?' అని బలరామయ్యగారిని అడిగి, 'నన్ను చూస్తాను' అన్నారు. చూశారు. నేను నమస్కారం సెట్టలేదు. పెద్దవాళ్లని చూస్తే నమస్కారం పెట్టాలన్న సంస్కారం నాకు లేదు. తెలీదు కూడా! నా ప్రవర్తనకి రామబ్రహ్మంగారు కాస్త చిరాగ్గా చూసి "ఏవడయ్యా వీడు" అని అడిగారు మీ వాడే అన్నారు బలరామయ్య గారు అంటే మీ కులం వాడేనని సూచన...  అందుకేనా అంత..." అన్నారు రామబ్రహ్మంగారు - నాకు పొగరుందన్నట్టు దాంతో  నాకా వేషం ఇవ్వరేమో అనుకున్నాను. ఐతే, బలరామయ్యగారు మధుసూదనరావుగారూ నా గురించి చెప్పారు. "పల్లెటూరి వాడు, పద్ధతులు తెలియవు అంతేగాని పొగరుబోతు కాడు. చాలా మంచి కుర్రాడు. వృద్ధిలోకి రావలసిన వాడు అన్నారు మీరు పెద్ద మనసుతో మన్నించండి. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. మీరు ఆ వేషం ఇచ్చి ప్రోత్సహించండి" అన్నట్టుగా నా తరపున మధ

★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -8★

Image
★అక్కినేని "మనసులోని మాట"  పార్ట్ -8★  #మహాద్రష్ట #బలరామయ్యగారు ఘంటసాల బలరామయ్యగారు దగ్గర నేను నటుడిని మాత్రమే కాదు. అంతకంటే దగ్గరవాడిని. నన్ను కొడుకులా చూసుకున్నారు. ప్రేమతో లాలించారు; అభిమానం కురిపించారు. ఆ రోజుల్లో పెద్దలు అలాగే వుండేవారు. కలిసిమెలిసి బంధువుల్లా స్నేహితుల్లా మెలిగేవారు. ఐతే, నా సహవాసం అంతా పెద్దవాళ్లతోనే. అందరూ నాకంటే పెద్ద వయసు వారే. ఒక సినిమాకి వెళ్లాలన్నా, బీచికి వెళ్లాలన్నా ఎక్కెడికి వెళ్లాలన్నా వాళ్లతోనే వెళ్లేవాడిని. పెద్దవాళ్ల వెనక వెళ్తున్నప్పుడు, సహ వాసులతో మాట్లాడినట్టు సరదాగా మాట్లాడలేం కదా. మౌనంగానే వుండేవాడిని.  వాళ్లు కూడా కుర్రాడిని వున్నానని జాగ్రతగానే మాట్లాడేవారు. ఆ సాంగత్యమే గొప్పది, అదే జీవితంలో, సన్మార్గంలో నడవడానికి దోహదం చేసింది. బలరామయ్యగారు, గొప్ప దర్శకుడనిచెప్పు కోరేమో గానీ, నేను మాత్రం ఒక గొప్ప ద్రష్టగా చెప్పగలను. ఎవరైనా నటుడిగా పనికొస్తాడో లేదోచూడడానికి నటింపజేస్తారు: హావభావాలు, నడక, ఆంగీకం, చూస్తారు. కాని, బల రామయ్యగారు నాకు అలాంటి పరీక్షలు పెట్టకుండా, ప్లాట్ ఫామ్ మీద చూసి చూడగాన సినిమాలకి పనికొస్తానని ఊహించ గలిగారం

అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★

Image
★అక్కినేని "మనసులోని మాట"  పార్ట్ -7★  #శ్రీరాముడిగాప్రవేశం ప్రతిభా ఆఫీసులో ప్రతిభా వంతులెందరో కనిపించారు, నన్ను రామలక్ష్మణుల్లో ఏదో ఒక పాత్రకి అని ముందుఅను కున్నారట. శ్రీరాముడి పాత్రకి ఇంకెవరైనా దొరికితే నేను లక్ష్మణుడు; లేకపోతే నేనే రాముడు. నా అదృష్టం - రాముడి పాత్ర నన్నే వరించింది రాముడిగా మేకప్ వేశారు; దుస్తులు వేశారు. నేను సన్నగా వుండేవాడిని. భుజాల దగ్గర బొమికెలు కనిపిస్తున్నాయని 'పాడింగ్' వేసి చెమ్మీకోటు వేశారు. నుదుటి మీద కొంత జుట్టు కత్తిరించి, విగ్గు పెట్టి కిరీటం పెట్టి చూసుకున్నారు. అందరూ“బాగున్నాడు అన్నారు. కాని, నాకే పెద్ద అనుమానం, భయం. సినిమా నట జీవితం ఆరంభం కాబోతోంది. ఈ తొలిషాటు ఏ దిక్కుకు తీసుకెళ్తుందో! ఏ స్థాయిలో నిలబెడుతుందో హరిశ్చంద్రుడు మన వంశము వాడే కదా" అన్నది తొలి డైలాగు. కెమెరా ముందు దీపాల వెలుగులో ఆ సంభాషణ చెప్పే ముందు, చెప్పిన తర్వాత గడగడ వణికాను. నాటకంలోని నటులు అలవాటయిన వాళ్లు, ఇక్కడ మహామహులు, మహానటులు అనుభవజ్ఞులు! బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు, వేమూరి గ్గయ్యగారు, పారుపల్లి సుబ్బారావుగారు, సత్యనారాయణగారు, తీగెల వెంకటేశ్వర్లుగ

★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -6★

Image
★అక్కినేని "మనసులోని మాట"  పార్ట్ -6★ #పితృతుల్యులు #దుక్కిపాటి మధుసూదనరావుగారు ఎక్సెల్షియర్ థియేటర్ అని, ముదినేపల్లిలో మంచి నాటక సంస్థ. కోడూరి అచ్చయ్య చౌదరిగారు ఆ సంస్థకి అధ్యక్షులు,  దుక్కిపాటి మధుసూదనరావుగారు కార్యదర్శి. వరసగా నాటకాలు ప్రదర్శిస్తూ వుంటారు. గుడివాడ కుర్రవాళ్ళతో బుద్ధిరాజు శ్రీరామమూర్తిగారి (హార్మోనిస్టు) ఆధ్వర్యంలో 'విప్రనారాయణ'లో దేవదేవి వేషం వేశాను అది చూసి మా అన్న రామబ్రహ్మంగారితో మాట్లాడి ఆయన ముదినేపల్లి తీసుకువెళ్లారు. సంప్రదాయమైన విధానం, క్రమశిక్షణ గల సంస్థ అది. కోడూరి అచ్చయ్య చౌదరిగారు మంచి నటుడు. పాత్రల మీద అవగాహనవున్న వారు. ఆయన బాగా శిక్షణ ఇచ్చేవారు. మధుసూదనరావుగారు, తక్కిన విషయాలు చూసుకునేవారు. ఐతే, ఏ క్షణం నన్ను మధు సూదనరావుగారికి పరిచయం చేసిందోగాని - ఆ క్షణం అమిత బలీయమైనది. నన్ను తీర్చిదిద్దిన వారిలో ఒకరిగా, నా బాగోగులు, మంచి చెడ్డలు చూసేవారిగా మాఅన్నపూర్ణ సంస్థకు నిర్మాతగా మధుసూదనరావుగారు ఒక వృక్షంలాగా నిలబడి, నన్నుఆదరించారు. ఆనాటి నుంచి ఆ అనుబంధం - కొనసాగుతూనే వచ్చింది - ఒక్కస్టూడియో నిర్మాణం విషయంలో తప్ప...? ఎవరైనా, జీవితం

★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -5★

Image
★అక్కినేని "మనసులోని మాట"  పార్ట్ -5★ #అర్థాంగి'లో ఎంత మంచి పాత్ర నేను నటుడినయిన తర్వాత, అంటే 1954 ప్రాంతాల పుల్లయ్యగారు 'అర్థాంగి' సినిమాలోనటించమని అడగడానికి వచ్చారు. ఆయన కనిపించినప్పుడల్లా - 14 ఏళ్ల క్రితం ఆయన తిట్టిన తిట్టు గుర్తు వస్తూనే వుండేది. ఆత్మాభిమానాన్ని ముల్లుపెట్టిపొడిచే ఏ సంఘటనయినా, నా మనసులో గట్టి ముద్రవేసేస్తుంది. అంచేత 'అర్థాంగి'లో వెయ్యమని అడిగినప్పుడు వేస్తాను గాని... మీరు నన్ను లం... అని తిట్ట కూడదు ధర్మపత్ని సమయంలో తిట్టారు" అన్నాను| ఓరి బలే వాడివయ్యా.. ఎప్పటి మాట! ఏదో అని వుంటాను గాని, తిట్టాలని కాదు. ఊత పదంలా అలా వాడేస్తూ వుంటాను. అంతే - అందులో ఏ కల్మషంలేదు"అన్నారు పుల్లయ్యగారు- అమాయకంగా... మొదట్నుంచి శాంతకుమారి గారు, పుల్లయ్యగారు నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు. ఇద్దరూ తల్లిదండ్రుల వంటి వారు. అంతటి పూజ్యభావం నాకు అర్థాంగి' సందర్భం వచ్చింది గనక, ఒకమాట చెబుతాను. అది బెంగాలి కథ- 'స్వయంసిద్ధ'. తెలుగులోకి మద్దిపట్ల సూరిగారు అనువదించారు. చాలా మంచి కథ.  అందులో అన్నదమ్ముల్లో  అన్న వేషం ఎన్.టి.రామారావుగారు వేస్

అక్కినేని మనసులోని మాట పార్ట్ -4

Image
అక్కినేని మనసులోని మాట  పార్ట్ -4 #తొలిఅవకాశం అసలు, నాకు సినిమా అవకాశం 'ధర్మపత్ని' కంటె ముందే వచ్చింది. అది తల్లి ప్రేమ' సినిమా. రాజరాజేశ్వరి వారిది. అందులో ఒక కుర్రాడి వేషం వుందని కడారు నాగభూషణంగారు ఎన్నిక చేసి మద్రాసు తీసుకెళ్లారు. ఆ సినిమాకి దర్శకుడు జ్యోతి సిన్హా అనే ఆయన. నాలుగు నెలలున్నాను కాని, నాకు వేషం రాలేదు! కథలో ఎప్పుడో వస్తుంది. అప్పటికే కథ పెద్దదయి పోయిందని ఆ వేషం వద్దనుకున్నారు. ఐతే కన్నాంబగారు, సి.ఎస్.ఆర్, ఆంజనేయులుగారు వంటి నటుల్ని చూడగలిగాను. సినిమా హీరో అయిన తర్వాత, 'దేవదాసు' లాంటి అజరామరమైన పాత్రని ఇచ్చిన డి.ఎల్.గారిని అప్పుడే కలుసుకున్నాను. ఆ సినిమాకి ఆయన ప్రొడక్షన్ మేనేజరు. నన్ను బాగా అభిమానించేవారు. ఉత్తరకాలంలో ఆయనొక నిర్మాత అవుతారని గాని, నేనొక హీరోని అవుతానని గాని, ఏ మాత్రం ఊహకి అందని విషయం. డి.యల్ గారికి పిల్లల్లేరు అందుకే నన్ను ప్రేమగా చూసుకునే వారను కుంటాను. వారి భార్య నాంచారమ్మగారు కూడా చక్కగా ఆదరించేవారు. మొదటిసారి, వాళ్లింటికి నన్ను తీసుకెళ్లి - నాకు భోజనం పెట్టమని అడిగినప్పుడు - ఆవిడ "ఎవరండీ ఈ కుర్రాడు?" అని అడిగి

అక్కినేని మనసులోని మాట..పార్ట్-3

Image
అక్కినేని మనసులోని మాట..పార్ట్-3  #నిజమైన #జన్మదినం 1924మే నెల, 8వ తేదీ ఈ రోజు మద్రాసు నగరంలో నేను సినిమా నటుడిగా అడుగుపెట్టిన రోజు.. అందుకే, ఈ రోజునే నేను నా పుట్టిన రోజుగా భావిస్తాను. దుక్కిపాటి మధుసూదన రావుగారు ఎక్సెల్షియర్ నాటక సంస్థకి కార్యదర్శి. వారికీ నాకూ ఏ చుట్టరికం లేకపోయినా నన్నెంతో ఆదరించేవారు. అన్నివిధాలా ఆయన నాకు పెద్ద దిక్కు గనక ఆయనే నన్ను మద్రాసు తీసుకొచ్చారు. మేమిద్దరం, మాతోపాటు పోలవరపు సూర్యప్రకాశరావుగారు ముగ్గురం రైల్వే స్టేషన్ నుంచి, జట్కా బండిలో బయల్దేరి ప్రతిభా ఆఫీసు దగ్గర దిగాం. సినిమా ప్రపంచంలో నాతొలి అడుగు పడింది. శ్రీరాముడి పాత్రకి కొత్త వాడొచ్చాడని, నన్ను చూడ్డానికి పెద్దలు వచ్చారు. పేకేటి శివరాం, బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు, మేనేజర్ కోటీశ్వరరావుగారు, అందరూ నన్ను చూస్తూ “రాతమ్ముడూ - రా" అని లోపలికి పిలుస్తూ వుంటే, ఎక్కడి వాడిని- ఎక్కడి కొచ్చాను ఎక్కడో గ్రామంలో పుట్టి, తిరిగిన వాడిని... ఈ పెద్దల మధ్యకి వచ్చానా? నా బాల్య దశ గుర్తొచ్చింది గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురం అనే గ్రామంలోపుట్టిన వాడికి, ( 20-9-1924) చిన్నతనంలో ఆకతాయిగా తిరిగిన వాడికి

అక్కినేని మనసులోని మాట..పార్ట్-2

Image
అక్కినేని మనసులోని మాట..పార్ట్-2  #బెజవాడరైల్వేస్టేషన్ మా "ఎక్సెల్షియర్" నాటక బృందం తెనాలిలో నాటకం ప్రదర్శించి బెజవాడ వచ్చి, గుడివాడ వెళ్లడానికి ప్లాట్ ఫాం మీద సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కేరింతలాడుకుంటూ బండి కోసంనిరీక్షిస్తున్నాం. బండి వచ్చి ఆగింది. ఎక్కడో దగ్గర మేం ఎక్కి కూచోడానికి హడావుడి పడుతున్న సమయంలో, ఫస్ట్ క్లాసులో కూచున్న ఒక వ్యక్తి కళ్లు నా మీద పడ్డాయి. నేనూ ఆయన్ని చూశాను. విశాలమైన ముఖం, బట్టతల కళ్లజోడుతో నిగనిగ లాడుతున్నారు. హిందీ సినిమాలు చూసే వాడిని గనక ఆయన్ని చూడగానే సినిమాల్లో తండ్రి వేషాలు వెయ్యడానికి బాగుంటారే అనిపించింది నా వూహకి. నావేపు ఆయన కూడా పరిశీలనగా చూస్తున్నారెందుకో.. దగ్గరికి పిలిచారు. ఏ వూరని అడిగారు. ఏం చేస్తుంటావని అడిగారు. నాటకాల్లో ఆడవేషాలు వేస్తానని చెప్పడం, 'సినిమాల్లో వేస్తావా' అని ఆయన అడగడం, నేను ఆనందపడుతూ "ఓ" అనడం నా వివరాలు తెలుసుకోవడం జరిగిపోయాయి.. ఆయనెవరో నాకు తెలీదు. అలా ఎందుకడిగారో తెలీదు. ఆతర్వాత తెలిసింది అతర్వాత ఆయన దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్యగారని. నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాలో, శ్

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

Image
అక్కినేని మనసులోని మాట..పార్ట్-1 -#అక్కినేని #ముందుమాట ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు..!!?? నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. చదువుకోలేదు. సంస్కారం తెలీదు. మాట్లాడ్డం తెలీదు. పెద్దలు కనిపిస్తే నమస్కారం పెట్టాలని కూడా తెలియని వాడిని, అలాంటి వాడిని ఈ సినిమా ప్రపంచం నన్నొక మనిషిని చేసింది. నటుడిగా తీర్చిదిద్దింది. "అక్కినేని నాగేశ్వరరావు"గా నిలబెట్టింది. పెద్దలసహనాసం, సత్సాంగత్యంతోనే నేను ఎన్నో నేర్చుకున్నాను. జీవితం తెలుసుకోగలిగాను. మట్టిముద్దలాంటి నాకు ఎందరెందరో మహనీయులు ఒక రూపం ఇచ్చారు. విభిన్నమైన పాత్రలు ధరింపజేసి నటుడిగా నిలబడ్డానికి అవకాశాలు కల్పించారు. ధరించిన పాత్రలు కూడా గురువులై నాకు పాఠాలుచెప్పాయి. ఐతే, క్రమేణా పాత్రల్ని ఎన్నిక చేసుకునే స్థితికి వచ్చాను.నేను చెయ్యగలననుకున్న పాత్రల్నీ చెయ్యదగ్గ పాత్రల్నే ధరించాను.  ఆస్థితిలో ఎన్నో పాత్రలు నిరాకరించ వలసి వచ్చింది. ఆ పెద్దలకి ఆగ్రహం తెప్పించవలసివచ్చింది. మొదట్నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించి, నా భవిష్యత్తుకి బాట వేసిన నిర్మాతల మాట నేనెందుకు కాదన్నాను? ఎందుకాపాత్రలు అంగీకరించలేదు?  వారికి మనస్తాపం కలిగించే లాగాఎందు