★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -8★

★అక్కినేని "మనసులోని మాట"  పార్ట్ -8★
 #మహాద్రష్ట #బలరామయ్యగారు
ఘంటసాల బలరామయ్యగారు దగ్గర నేను నటుడిని మాత్రమే కాదు. అంతకంటే దగ్గరవాడిని. నన్ను కొడుకులా చూసుకున్నారు. ప్రేమతో లాలించారు; అభిమానం కురిపించారు. ఆ రోజుల్లో పెద్దలు అలాగే వుండేవారు. కలిసిమెలిసి బంధువుల్లా స్నేహితుల్లా మెలిగేవారు. ఐతే, నా సహవాసం అంతా పెద్దవాళ్లతోనే. అందరూ నాకంటే పెద్ద వయసు వారే. ఒక సినిమాకి వెళ్లాలన్నా, బీచికి వెళ్లాలన్నా ఎక్కెడికి వెళ్లాలన్నా వాళ్లతోనే వెళ్లేవాడిని. పెద్దవాళ్ల వెనక వెళ్తున్నప్పుడు, సహ వాసులతో మాట్లాడినట్టు సరదాగా మాట్లాడలేం కదా. మౌనంగానే వుండేవాడిని.  వాళ్లు కూడా కుర్రాడిని వున్నానని జాగ్రతగానే మాట్లాడేవారు. ఆ సాంగత్యమే గొప్పది, అదే
జీవితంలో, సన్మార్గంలో నడవడానికి దోహదం చేసింది.

బలరామయ్యగారు, గొప్ప దర్శకుడనిచెప్పు కోరేమో గానీ, నేను మాత్రం ఒక గొప్ప ద్రష్టగా
చెప్పగలను. ఎవరైనా నటుడిగా పనికొస్తాడో లేదోచూడడానికి నటింపజేస్తారు: హావభావాలు, నడక, ఆంగీకం,
చూస్తారు. కాని, బల రామయ్యగారు నాకు అలాంటి పరీక్షలు పెట్టకుండా, ప్లాట్ ఫామ్ మీద చూసి చూడగాన సినిమాలకి పనికొస్తానని ఊహించ గలిగారంటే అది కూడా ఒక దర్శకుడికి వుండవలసిన లక్షణమే - అని నాకు అనిపిస్తుంది. అలాంటి 'ముందుచూపు' గల వారు
బలరామయ్యగారు, వారి కుటుంబ సభ్యులు కూడా నన్ను ఆత్మీయుడి లాగానే ఆదరించారు. వాళ్ల కుటుంబంలో నేనూ ఒకడిగా కలిసిపోయాను. అవి ఆనాటి ఆత్మీయభావాలు నేను కూడా. "నటుడిని కదా...నాకెందుకు?" అని కాకుండా నాకు నేనుగా వీలైన పన్లు చేసే వాడిని; చెప్పిన పన్లు కూడా శ్రద్దగా చేసేవాడిని, నేను రాముడు వేషం వేస్తున్నాను గనక, అందరూ నన్ను 'రాముడూ' అని పిలిచేవారు.
నా దుస్తుల విషయంలో, అలంకారం విషయంలో ఎన్నో సూచనలు చేసి, సలహాలిచ్చే వారు బలరానుయ్యగారు, నాకు సిల్కు చొక్కాలు కుట్టించి, "దర్జాగా వుండు రాముడూ!" అని అభినందించేవారు. నా పెళ్లి విషయంలో కూడా ఆయన ప్రమేయం వుంది. నా పెళ్లిరోజులు, ఆయనసినిమా షూటింగ్ రోజులూ ఒకటే. షూటింగ్స్ కాన్ఫిల్ చేసి, దగ్గరుండి ఆయన నా పెళ్లి జరిపించారు.
ఎంత అదృష్టవంతుడిని! ఎంతమందికి దక్కుతుంది ఈ గౌరవం? దర్శకుడు, నటీనటుల ఉండవలసిన అనుబంధం, ఆప్యాయతా ఎలా వుంటాయో ఆ తొలి చిత్రంతోనే తెలుసుకున్నాను
ఐతే, ఇవాళ ఎందుకనో అవన్నీ దూరమైపోయాయి. వ్యాపారధోరణిలో - అనురాగభావం అంతరించింది. దర్శకుడు, నటుడూ షూటింగ్లో కలుసుకోడం వరకే తప్పు, తర్వాత ఎవరికి వారే
అయిపోతున్నారు! ఆనాటి ఆత్మీయతా భావాల మధ్య ఎదిగిన వాడిని గనకే, నేను నా జీవితాన్ని సక్రమమార్గంలో పెట్టుకోగలిగాను. నేను పని చేసిన ప్రతి సంస్థతోనూ అలాంటి అనుబంధమే
పెట్టుకోడానికి అదే పునాది. నాకు దైవం, తండ్రీ లాంటి బలరామయ్యగారిని నేను అనునిత్యంస్మరించుకుంటూనే వుంటాను...(సశేషం)
               -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'