★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -9★
★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -9★
ఇంకొక #పితృతుల్యులు #రామబ్రహ్మంగారు :
గూడవల్లి రామబ్రహ్మంగారు, 'మాయలోకం' పేరుతో జానపదం అరంభిస్తున్నారు. అందులో రాకుమారుడి పాత్ర వుంది. 'సీతారామజననం'లోకొత్తకుర్రాడు, రాముడు వేషం వేస్తున్నాడని విని ఆయనవున్నాడు?' అని బలరామయ్యగారిని అడిగి, 'నన్ను చూస్తాను' అన్నారు. చూశారు. నేను నమస్కారం సెట్టలేదు. పెద్దవాళ్లని చూస్తే నమస్కారం పెట్టాలన్న సంస్కారం నాకు
లేదు. తెలీదు కూడా! నా ప్రవర్తనకి రామబ్రహ్మంగారు కాస్త చిరాగ్గా చూసి "ఏవడయ్యా
వీడు" అని అడిగారు
మీ వాడే అన్నారు బలరామయ్య గారు అంటే మీ కులం వాడేనని సూచన...
అందుకేనా అంత..." అన్నారు రామబ్రహ్మంగారు - నాకు పొగరుందన్నట్టు దాంతో
నాకా వేషం ఇవ్వరేమో అనుకున్నాను. ఐతే, బలరామయ్యగారు
మధుసూదనరావుగారూ నా గురించి చెప్పారు. "పల్లెటూరి వాడు, పద్ధతులు తెలియవు అంతేగాని పొగరుబోతు కాడు. చాలా మంచి కుర్రాడు. వృద్ధిలోకి రావలసిన వాడు అన్నారు మీరు పెద్ద మనసుతో మన్నించండి. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. మీరు ఆ వేషం
ఇచ్చి ప్రోత్సహించండి" అన్నట్టుగా నా తరపున మధుసూదనరావుగారు సంజాయిషీ చెప్పుకున్నారు
కూడా నా గురించి రామబ్రహ్మంగారికి చెప్పారు. సంస్కారం తెలియకసోడం చేతనమస్కారం పెట్టకపోడం చేత, ఇంత మంది పెటద్దలు నా గురించి చెప్పవలసి వచ్చింది.
పెద్దవాళ్లు కనిపిస్తే, వినయ విధేయతలతో, నమస్కారాలు పెట్టి గౌరవించాలని
తెలుసుకోగలిగాను. అపక్యదశలో వున్న జీవితానికి ఇలాంటివి తెలియాలంటే నిదానంగాతెలుస్తాయి. అనుభవమే పాఠాలు చెబుతుంది. ప్రతిదీ అనుభవించవలసిందే!
ఆ అనుభవంలో
ఎన్నో... అడ్డంకులు!
ఎన్నో... ఇబ్బందులు...
చల్లపల్లి రాజావారు నేను వేసిన నాటకాలు చూశారు గనక, అయనమాయ లోకం'లో, అక్కడ కూడాఅందరూ పెద్దవాళ్లే. సమవయస్కులు లేరు. గోవిందరాజు సుబ్బా రావుగారూమొత్తానికి నాకు పాత్ర లభించింది
కన్నాంబగారు, లంక సత్యంగారు, సి.ఎస్.ఆర్ గారు, గిడుగు సీతాపతి గారు
ఇలాఎందరో ఆరితేరిన నటుల మధ్య నేను! అక్కడంతా క్రమశిక్షణ. గంట కొట్టేవారు
గంటకొడితే, భోజనాలకి వెళ్లాలి. మళ్లీ గంటకొడితే, రావాలి. స్కూలు నడిపినట్టే నడిపారు.
రామబ్రహ్మంగారు. నాలుగైదు రోజులు పని చేసిన తర్వాత, రామబ్రహ్మంగారికి నాపట్ల
వాత్సల్యం కలిగింది. ప్రేమ పెరిగింది. భోజనానికి ప్రత్యేకం వంటశాల వున్నా
రామబ్రహ్మంగారు తన ఇంట్లోనే భోజనం పెట్టేవారు నాకు . నన్ను తన ఇంట్లోనే
పెట్టుకున్నారు
రామబ్రహ్మంగారిది మంచి భాష ఆయన పత్రిక నడిపొరు. 'మాలపిల్ల', 'రైతుబిడ్డ
లాంటి గొప్ప చిత్రాలు తీశారు. నాటకాల్లో సంభాషణలు చెప్పినప్పుడు - ఆ భాష వేరు
అది బాగానే చెప్పొచ్చు. కాని, మామూలుగా మాట్లాడి నప్పుడు ఆ భాష రాదే.వ్యవహారంలో
గ్రామీణ భాషేవస్తుంది.
పెద్దవాళ్ల సాంగత్యంతోనే భాషా సంస్కారాలు అలవడతాయి.
ప్రత్యేకంగా అభ్యసించనక్కర్లేదు
ఆయన, భార్య ఎంతో ప్రేమతో, ఏం కావాలో పెట్టి ఆదరించారు.
షూటింగ్స్ లో రామ బ్రహ్మంగారు "ఒరే నాగూ! గోవిందరాజులసుబ్బా రావుగారు గొప్ప నటులు , ఆయన ఏమైనా సలహా ఇస్తే విను. ఆయన చెప్పినట్టు చెప్పు" అని చెప్తే
నా సంభాషణ ఆయన చెప్పినట్టుగా అలా చెప్పేవాణ్ణి, "ఏమిట్రా అంతలాగుడు
అన్నానని అని మళ్లీ ఆయనే నన్ను మందలించేవారు.
నేను కొత్తవాడిని. చిన్న వాడిని. అంచేత అందరూ నాకు సలహాలు చెప్పేవారు. వినకపోతే ఏమనుకుంటారో. ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. అన్నీ విని నా ధోరణిలో నేను చేసేవాడిని. దైతా గోపాలం గారు నాకు 'ధర్మపత్ని సమయంలో తెలుసు. ఆయన కాంచనమాలకి సంభాషణలు నేర్పేవారట. నేను ఆయనమామూలుగా చెప్పు, ఆయన ముందు ఏదో అదే పట్టు క్కూచుంటావేం?
దగ్గర నేర్చుకున్నాను. సాంఘిక నాటకాల్లో వేషాలు వేశాను కాబట్టి ఆ ధోరణి నాకు
అలవాటే. రామబ్రహ్మంగారు ఆ ధోరణిలోనే చెప్పమనే వారు. పెద్ద పులుల మధ్య మేక చిక్కుకుని నెగ్గుకు రావాలి. ఆత్మబలం, ధైర్యం ప్రోత్స హించాలి. 'మాయలోకం'లో నేను బాగున్నానని, బాగానే చేశానని అన్నారు. జానపద కథ గనక ముగ్గురు భార్యల్ని
చేసుకుంటాడు శరాబందిరాజు. మొదటిరోజు షూటింగ్ లో శాంత కుమారిగారు అన్నారు
కూడా - "ఇదేమిటీ, నా పక్కన కుర్రాడిని వేశారు?" అని. ఐతే, ఒక్కొక్కరూ ఒక్కోఘట్టంలో వస్తారు. వయసులో యస్.వరలక్ష్మి మాత్రం నాకంటె చిన్నది. శాంతకుమారిగారు, రాజమ్మ గార్ల పక్కన నేను తమ్ముడిలా కనిపించినా, కథా బలం వల్ల అదేదో పెద్ద లోపం అనిపించలేదు ప్రేక్షకులకి....
(సశేషం) -అక్కినేని
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment