అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★

★అక్కినేని "మనసులోని మాట"  పార్ట్ -7★
 #శ్రీరాముడిగాప్రవేశం
ప్రతిభా ఆఫీసులో ప్రతిభా వంతులెందరో కనిపించారు, నన్ను రామలక్ష్మణుల్లో ఏదో ఒక పాత్రకి అని ముందుఅను కున్నారట. శ్రీరాముడి పాత్రకి ఇంకెవరైనా దొరికితే నేను లక్ష్మణుడు; లేకపోతే నేనే రాముడు. నా అదృష్టం - రాముడి పాత్ర నన్నే వరించింది
రాముడిగా మేకప్ వేశారు; దుస్తులు వేశారు. నేను సన్నగా వుండేవాడిని. భుజాల దగ్గర
బొమికెలు కనిపిస్తున్నాయని 'పాడింగ్' వేసి చెమ్మీకోటు వేశారు. నుదుటి మీద కొంత
జుట్టు కత్తిరించి, విగ్గు పెట్టి కిరీటం పెట్టి చూసుకున్నారు. అందరూ“బాగున్నాడు అన్నారు. కాని, నాకే పెద్ద అనుమానం, భయం. సినిమా నట జీవితం ఆరంభం కాబోతోంది. ఈ తొలిషాటు ఏ దిక్కుకు తీసుకెళ్తుందో! ఏ స్థాయిలో నిలబెడుతుందో
హరిశ్చంద్రుడు మన వంశము వాడే కదా" అన్నది తొలి డైలాగు. కెమెరా ముందు
దీపాల వెలుగులో ఆ సంభాషణ చెప్పే ముందు, చెప్పిన తర్వాత గడగడ వణికాను.
నాటకంలోని నటులు అలవాటయిన వాళ్లు, ఇక్కడ మహామహులు, మహానటులు
అనుభవజ్ఞులు! బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు, వేమూరి గ్గయ్యగారు, పారుపల్లి
సుబ్బారావుగారు, సత్యనారాయణగారు, తీగెల వెంకటేశ్వర్లుగారు, కమలా కోట్నీస్ గారు ఋష్వేంద్ర మణిగారు ఇలా ఎందరో. ఘంటసాల బలరామయ్య గారు సరేసరి. ఆయన ఏం భయం లేదు' అని ప్రోత్సహించారు; "బాగా చెప్పావు" అని అభి నందించారు.
గురుబ్రహ్మ పరమేశ్వర వందే" అన్న పాట కూడా పాడాను. ఆ రోజుల్లో షూటింగ్ లోనే
పాట రికార్డింగు, లక్ష్మణుడి వేషం ప్రొద్దుటూరు రాజు వేశాడు. బాలత్రిపురసుందరి
సీత. ఆఫీసులోనే నేను వుండేవాడిని. నేను వెళ్ళిన కొంతకాలానికి ఘంటసాల
వెంకటేశ్వరరావుగారు వచ్చారు, ఇద్దరం ఒక గదిలో వుండేవాళ్లం. ఆయన సినిమాల్లో వేషాలు వెయ్యాలనీ, పాటలు పాడాలనీ వచ్చారు. ఆ ప్రయత్నాల్లో వున్నారు. 'సీతారామ జననం'లో బృంద గానాల్లో పాడారు. చిన్న వేషంలో కనిపించారు. ఆ
ఒక రోజున ఘంటసాల'గా నాకు గాత్ర సహకారం ఇచ్చి, నా నటనకు పాట సాయం
వెంకటేశ్వరరావే
చేస్తారని నేను వూహించానా? ఎవరూ ఊహించలేరు. భవిష్యత్తులో ఏది ఎలా
జరుగుతుందో, అది కథని ఎలా నడిపిస్తుందో - ఎవరికి మాత్రం తెలుసు......(సశేషం)
    -అక్కినేని
(ఈ చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'