★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -5★
★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -5★
#అర్థాంగి'లో ఎంత మంచి పాత్ర
నేను నటుడినయిన తర్వాత, అంటే 1954 ప్రాంతాల పుల్లయ్యగారు 'అర్థాంగి' సినిమాలోనటించమని అడగడానికి వచ్చారు. ఆయన కనిపించినప్పుడల్లా - 14 ఏళ్ల క్రితం ఆయన తిట్టిన తిట్టు
గుర్తు వస్తూనే వుండేది. ఆత్మాభిమానాన్ని ముల్లుపెట్టిపొడిచే ఏ సంఘటనయినా, నా మనసులో గట్టి ముద్రవేసేస్తుంది. అంచేత 'అర్థాంగి'లో వెయ్యమని అడిగినప్పుడు
వేస్తాను గాని... మీరు నన్ను లం... అని తిట్ట కూడదు
ధర్మపత్ని సమయంలో తిట్టారు" అన్నాను|
ఓరి బలే వాడివయ్యా.. ఎప్పటి మాట! ఏదో
అని వుంటాను గాని, తిట్టాలని కాదు. ఊత పదంలా అలా వాడేస్తూ వుంటాను. అంతే - అందులో ఏ కల్మషంలేదు"అన్నారు పుల్లయ్యగారు- అమాయకంగా...
మొదట్నుంచి శాంతకుమారి గారు, పుల్లయ్యగారు నన్ను
ఎంతో ప్రేమగా చూసేవారు. ఇద్దరూ తల్లిదండ్రుల వంటి
వారు. అంతటి పూజ్యభావం నాకు
అర్థాంగి' సందర్భం వచ్చింది గనక, ఒకమాట చెబుతాను. అది బెంగాలి కథ- 'స్వయంసిద్ధ'. తెలుగులోకి మద్దిపట్ల సూరిగారు అనువదించారు.
చాలా మంచి కథ.
అందులో అన్నదమ్ముల్లో
అన్న వేషం ఎన్.టి.రామారావుగారు వేస్తారనీ నన్ను తమ్ముడు వెయ్యమనీ అడిగారు పుల్లయ్యగారు,. ఇద్దరు హీరోలని పెట్టి ఆ సినిమా తియ్యాలని ఆయన ఉద్దేశం. అప్పటికి నేను పాత్రల్ని ఎంపిక చేసుకో వడంలో, తెలివిగా
ఆలోచించేవాడిని. "తమ్ముడు పాత్ర దుష్టుడు. అది నేను వేస్తే బాగుండదు. పెద్దవాడివేషం ఇస్తే వేస్తాను. నటించడానికి అవకాశం వున్న పాత్ర. తమ్ముడి పాత్ర మీయిష్టం ఎవరి చేతనైనా వేయించండి” అన్నాను వినయంగా. అదొక భిన్నమైన పాత్ర. “నాకువస్తే బాగుండును- ఇస్తారా - ఏమంటారో, ఏం ఆలోచించు కుంటారో-” అని నేను ఆలోచనలో పడగా- పుల్లయ్యగారు నాకు అన్న పాత్రనే ఇచ్చారు. తమ్ముడు జగ్గయ్యగారువేశారు. అద్భుతమైన చిత్రంగా, ఆ సినిమాకి ఎంత పేరు వచ్చిందో, నా పాత్ర ధారణకి కూడా అంత పేరొచ్చింది. ముత్యాలసరం లాంటి సినిమా- 'అర్థాంగి', అందులో నా పాత్ర ఆణిముత్యం
ధర్మపత్ని' తర్వాత తిరిగి వచ్చి మళ్లీ నాటకాలు. కంఠంలో ఇంకా మగతనంరాలేదు గనక, 'సారంగధర'లో చెలికత్తె వేషం, 'హరిశ్చంద్ర'లో మాతంగ కన్య వేషంవేస్తూ వచ్చాను, హరిశ్చంద్ర'లో మాతంగ కన్యతో పాటు లోహితాస్యుడు కూడా వేసేవాడిని
చేయ్యాలి. ఇద్దరు కన్యలు. ఒక వేషం ఎవరో
అమ్మాయే వేసింది. మాకు నాట్యం కూడా నేర్పేవారు. ఎలా పాడమంటే అలా
పాడేసేవాడినో, నాట్య భంగిమలు కూడా అంతే. ఎలా చెబుతే అలా చెయ్యడమే
మాతంగ కన్య పాడుతూనాట్యం
కూడా చెయ్యడమే భక్త కుచేల' నాటకంలో నాకు అంజలి దేవిగారు తటస్థ పడ్డారు. ఆమె నాటకాలు బాగా వేస్తున్నారు. అప్పుడామె పేరు- అంజనీ కుమారి. ఆమె రుక్మిణి. నేను మోహిని.మోహిని కూడా నాట్యం చెయ్యాలి గదా.. చేశాను. ఇంకా ఇలాంటి నాట్య పాత్రలు కూడా వస్తాయేమోమోనని, జాగ్రత్తపడి నాట్యం నేర్చుకున్నాను. అదే, అప్పుడు పడిన ఆ పునాదే - తర్వాత నాకు సినిమాల్లో వళ్లు వంచుతూ, 'స్టెప్స్' వేస్తూ పాటలు పాడడానికి బలం సమకూర్చింది.(సశేషం)
-అక్కినేని
(ఈ వ్యాసాలు చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు) .
Comments
Post a Comment