అక్కినేని మనసులోని మాట పార్ట్ -4
అక్కినేని మనసులోని మాట పార్ట్ -4
#తొలిఅవకాశం
అసలు, నాకు సినిమా అవకాశం 'ధర్మపత్ని' కంటె ముందే వచ్చింది. అది
తల్లి ప్రేమ' సినిమా. రాజరాజేశ్వరి వారిది. అందులో ఒక కుర్రాడి వేషం వుందని కడారు
నాగభూషణంగారు ఎన్నిక చేసి మద్రాసు తీసుకెళ్లారు. ఆ సినిమాకి దర్శకుడు జ్యోతి
సిన్హా అనే ఆయన. నాలుగు నెలలున్నాను కాని, నాకు వేషం రాలేదు! కథలో ఎప్పుడో
వస్తుంది. అప్పటికే కథ పెద్దదయి పోయిందని ఆ వేషం వద్దనుకున్నారు. ఐతే
కన్నాంబగారు, సి.ఎస్.ఆర్, ఆంజనేయులుగారు వంటి నటుల్ని చూడగలిగాను. సినిమా హీరో అయిన తర్వాత, 'దేవదాసు' లాంటి అజరామరమైన పాత్రని ఇచ్చిన డి.ఎల్.గారిని
అప్పుడే కలుసుకున్నాను. ఆ సినిమాకి ఆయన ప్రొడక్షన్ మేనేజరు. నన్ను బాగా
అభిమానించేవారు. ఉత్తరకాలంలో ఆయనొక నిర్మాత అవుతారని గాని, నేనొక హీరోని అవుతానని గాని, ఏ మాత్రం ఊహకి అందని విషయం. డి.యల్ గారికి పిల్లల్లేరు అందుకే నన్ను ప్రేమగా చూసుకునే వారను కుంటాను. వారి భార్య నాంచారమ్మగారు కూడా చక్కగా ఆదరించేవారు. మొదటిసారి, వాళ్లింటికి నన్ను తీసుకెళ్లి - నాకు భోజనం
పెట్టమని అడిగినప్పుడు - ఆవిడ "ఎవరండీ ఈ కుర్రాడు?" అని అడిగింది. "మనవాళ్లే లేవే" అన్నారు డి.ఎల్.గారు. ఆవిడ ఇద్దరికీ భోజనం వడ్డించారు. వాళ్లు బ్రాహ్మణులు ఆవిడకి పట్టింపు ఎక్కువ. డి.ఎల్.గారికి అలాంటి వేమీ లేవు. అప్పుడు అనుకున్నాను కులం పట్టింపులు లేని వాళ్లలో ఆయన ఒకరని. అలా, వాళ్లింటికి వెళ్తూ వస్తూ వుండేవాడిని.
కొన్నాళ్ల తర్వాత ఒకరోజు నాంచారమ్మగారు పెళ్లి విషయం ఎత్తింది". "అబ్బాయి చక్కగా వున్నాడు. మా మరదలుంది కదా.... దాన్ని" అనగానే డి.ఎల్.గారు గొల్లున నవ్వి కమ్మవారి అబ్బాయే - అలా చెబితే నువ్వు భోజనం పెట్టవని, అబద్దం ఆడాను
అన్నారు. జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి తమాషాలు జరుగుతూ వుంటాయి.
తల్లిప్రేమ' సినిమా కోసం వెళ్లి వేషం వెయ్యకుండా తిరిగి వచ్చేస్తున్నప్పుడు నెలకి పాతిక రూపాయల చొప్పున - నాలుగునెల్లకీ నూరు రూపాయలు చేతిలో పెట్టారు. నూరురూపాయల సంపాదన మాటకేం గాని, మొదటి ప్రయత్నం అలా విఫలమైంది. వేషంరాలేదనో, పోయిందనో దిగులు పడలేదు. కొందరు పెద్దల్ని చూసిన అదృష్టం దక్కినందుకు సంతోషమే కలిగింది.
ఆ రోజుల్లో పాట, పద్యం పాడగల కుర్రాళ్లు దొరకడం కష్టంగా వుండేది. నేను
దొరికాను గనక, నాచేత నాటకాల్లో వికర్ణుడు, లోహితాస్యుడు లాంటి వేషాలు వేయించారు
చిన్న వయసులో వున్న మగ వేషాలు అవి. అదొక అనుభవం అప్పుడొచ్చింది 'ధర్మపత్ని' అవకాశం. 1940లో ఫేమస్ ఫిలింస్ వారు
పి.పుల్లయ్యగారి దర్శకత్వంలో 'ధర్మపత్ని' సినిమాని కొల్హాపూర్ లో ప్రారంభిస్తున్నారని విని, మా అన్నయ్య ఎలాగో వేషం సంపాదించాడు. తీరా వెళ్తే అనుకున్న వేషానికి పెద్దవాడినైపోయానని, పిల్లలతో పాటు ఒక వేషం వేయించారు. అందరం కలిసిఆనందమానంద మాయెనే.." అని ఓ పాట పాడే సన్నివేశం అది. 'ధర్మపత్ని'కి
చక్రపాణిగారు మాటలు రాశారు గనక ఆయన అక్కడే వున్నారు, భానుమతిగారు, శాంతకుమారిగారుఅలా కొందరు పెద్దలంతా వుండేవారు గాని, నేను మాత్రం పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ
తిరిగేవాడిని. పుల్లయ్యగారు పిలిచి, “ఒరే, నాటకాల వాడివి గనక, ఏదైనా మంచి
అంటే, "ఇందుగలడందు లేడని సందేహము వలదు” అని చదివేవాడిని. "చాలు ఊరుకోరా. ఎప్పుడూ
ఆ పద్యం తప్ప ఇంకోటి రాదు నీకు. వెధవ లం..” అని తిట్టారు. ఒక్కసారి ఒళ్లు ఝల్లుమంది పద్యం చదవరా ఈ తిట్టు ఎందుకనో నాలో బలంగా నాటుకుంది.
ధర్మపత్ని'లో నాది వేషం అని కాదు గాని, తెరమీద కనిపించాను గనుక, అదే నాతొలి.సినిమాగా లెక్క వేసుకున్నాను.
-అక్కినేని
(ఈ వ్యాసాలు చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు) .
Comments
Post a Comment