అక్కినేని"మనసులోని మాట"పార్ట్-14★

 
★అక్కినేని"మనసులోని మాట"పార్ట్-14★  
మహోన్నత రెండు చిత్రాల ఘన విజయం
48-49 సంవత్సరాల్లో - నా అదృష్టం - నేను ప్రధాన పాత్రలు ధరించినరెండు సినిమాలూ ఘన విజయం సాధించాయి. 'బాలరాజు', 'కీలుగుర్రం', 'బాలరాజు'కిముందు 'ముగ్గురు మరాటిలు', పల్నాటియుద్ధం' వచ్చాయి. ఈ రెండు సినిమాల్లోనూనావి ముఖ్యపాత్రలే గాని, ప్రధాన పాత్రలు కావు. రెండు పాత్రల్లోనూ వీర లక్షణాలున్నాయి
బాలచంద్రుడు - వీరకిశోరం. శృంగారం, పౌరుషం వున్న పాత్ర. గూడవల్లి
రామబ్రహ్మంగారు స్క్రీప్టు తిర్చిదిద్దారు. బాలచంద్రుడు, మాంచాల వున్న సన్నివేశాలు
మాత్రం ఆయన షూట్ చేశారు. తర్వాత ఆరోగ్యం బాగులేకుండా పోయింది
అంతవరకూ నేను వారి ఇంట్లోనే వుండేవాడిని. "నువ్వు నాకు సేవ చేస్తూ ఇక్కడే వుండడం
కాదు. వేరే ఇల్లు తీసుకుని వెళ్లు. నటన మీద శ్రద్ధ పెట్టు" అన్నారు రామబ్రహ్మంగారు.
అప్పుడు నేను ఎల్దామ్స్ రోడ్డులోని చిన్న ఇంటికి మారాను. వీలున్నప్పుడల్లా వెళ్లి ఆయన్ని
చూస్తూ, చెయ్యవలసిన సేవ చేస్తూ వచ్చాను. "జాతస్య మరణం ధ్రువం" అని పెద్దలు
చెప్పినట్టుగా, ఆ అమృతమూర్తి పరలోకం వెళ్లిపోయారు. తర్వాత 'పల్నాటియుద్ధం
చిత్రాన్ని ఎల్.వి.ప్రసాద్ గారు పూర్తి చేశారు. అప్పుడే నాకు వారితో పరిచయం. ప్రసాద్ గారు స్వతహాగా నటుడు. అంచేత బాలచంద్రుడి పాత్రని ఎలా చెయ్యాలో నటించి
చూపించేవారు. పాత్రకి ఎంత ఉద్రేకం కావాలో, చెప్పేవారు. ఐతే ఆయన చెప్పినట్టుగా
చెయ్యవలసిందే గాని, మనంగా చేసింది ఒప్పుకోరని అర్థమైంది. ఒకటికి రెండుసార్లూ
మూడుసార్లూ చెప్పి, రిహార్సల్స్ చేయించేవారు
 బాలరాజు' సినిమాలో హీరోనే అయినా, అతడు శాపగ్రస్థుడు. సాహసవీరుడు
కాదు. అలాంటి పాత్రను ఎలా ఎన్నిక చేసుకున్నానని తర్వాత ఎవరో అడిగారు. అప్పుడుఎన్నిక చేసుకునే స్థాయి ఎక్కడుంది? వేషం వస్తే చాలనుకునే రోజులు. పైగా అప్పటి
రోజుల్లో నాయికా, నాయకులు దర్శక నిర్మాతలే! జనాకర్షణ వుంటుందనే నమ్మకంతో
ఒక కథ తయారు చేసుకుని సినిమా నిర్మించడం తప్ప, “ఏ హీరో వుంటే బిజినెస్
జరుగుతుంది? ఎవరుంటే మంచిరేటుకి అమ్ముకోవచ్చు?" అనుకునే రోజులు కావవి
సినిమాకి కథే ముఖ్యం. కావలసిన పాత్రలకి నటుల్ని ఎన్నిక చేసుకుని మంచి సంగీతం
కూర్చుకుని క్రమశిక్షణతో చిత్ర నిర్మాణం చేసే రోజులవి. 'దేవదాసు' సినిమా తర్వాత
ఆ పేరు నిలబెట్టుకోడానికి - పాత్రల ఎన్నిక చేసుకోడం ఆరంభించానుగాని, అంతకుముందు లేదు. ఏ పాత్రయినా నాకు
నచ్చడం కాదు. ప్రజలు ఎలా ఆదరిస్తారనేదే
ఆలోచన. ఒక్కోసారి నాపాత్ర నాకు అంత తృప్తి
అనిపించకపోయినా, కథాపరంగా చూస్తేమంచికథ కాబట్టి, ఈ సినిమాని ప్రేక్షకులు
ఆదరిస్తారు. ఆ సినిమాలో నేను వున్నాను గనక
నన్ను చూస్తారు - అని తృప్తి పడేవాడిని.
బాలరాజు' సాత్ర గురించి, దాని స్వభావం గురించి నిశ్లేషించుకుని నాలో నేను మధనపడి నటించాలనుకునే స్థితి లేదప్పుడు. సన్నివేశాలువిని సంభాషణలు చెప్పడం తప్ప ఇంకోఆలోచనలేదు. చెప్పడంలో, చెయ్యడంలో ఎక్కువతక్కువలు చెసప్పేవారు దర్శకుడు. అహీరో విధానంలోనే చేసుకుంటూ వెళ్లాను
హీరోయిన్లు ఇద్దరూ శాపగ్రస్థులే. అంచేత, ఆ
పాత్రలు ప్రేక్షకుల అభిమానం పొందగలిగాయి
బాలరాజు' కామెడీ నుంచి హిట్టయిందని
ఎవరైనా అంటే శుద్ధ తప్పు. కామెడీ అనేది ప్రతి
సినిమాలోనూ వుంటుంది. అది కథా గమనానికి
సహాయపడుతుంది గాని, అదే ప్రధాన ఆకర్షణ
కాదు. 'దసరాబుల్లోడు'లో ఏముందన్న వాళ్లూ
వున్నారు. 'రోజులు మారాయి' సినిమా
ఏరువాక.. పాట వల్లనే హిట్టయిందనడంలో
ఎంత సత్యం వుందో - అదీ అలాంటిదే, సినిమా
.మొత్తం బాగుంటేనే - విజయం సాధిస్తుంది గాని రెండు దృశ్యాలు బాగున్నంత మాత్రాన విజయం సాధించేస్తుందా 'బాలరాజు'లో కామెడీ కూడా కథతో పాటే వుందిగాని, విడిగా లేదు. ఏమైతేనేం. మంచి సంగీతం, నటన, కథా గమనం అన్ని వుండి జనరంజకమైన చిత్రంగా నిలబడింది.
ఏకధాటిగా సంవత్సరం పాటు నడిచింది - 'బాలరాజు' అంతకుముందున్న కొన్ని
చిత్రాల వసూళ్లని అధిగమించింది
                (సశేషం)
                   -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'