అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-22

 
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-22★
అంతకు ముందు హిందీలో వచ్చిన కె.ఎల్.సైగల్ 'దేవదాసు నేను చూడలేదు. "ఆ పాత్రని ఎలా రూపొందించారో చూద్దామా?" అని అడిగితే, “వద్దు, నువ్వు చేసేది నువ్వు చెయ్యి. ఆ సినిమా చూడొద్దు" అన్నారు డి.ఎల్. 'దేవదాసు' విడదలయిపోయిన తర్వాత ఎప్పుడో సైగల్ సినిమా చూశాను, దిలీప్ కుమార్ నటించినదీ చూశాను. వాళ్లు మార్పులు చెయ్యలేదు. నవలని యథాతథంగానే తీశారు
దేవదాసు' 1953 జూన్ 26న విడుదలై, పెద్ద సంచలనం తెచ్చింది. పండితులు, పామరులూ అంతా మెచ్చుకున్నారు. సినిమాకి ఎంత పేరొచ్చిందో అంతపేరు నాకూ వచ్చింది. సావిత్రికీ వచ్చింది ప్రారంభానికి ముందు ముక్కున వేలేసుకున్న పరిశ్రమ - సినిమాగా ప్రేక్షకలోకంలోకి వెళ్లిన తర్వాత ఆ ఘన విజయం చూసి మరోసారి ముక్కున వేలేసుకుంది! పరిశ్రమనే ఒక మలుపు తిప్పిన ఆ సినిమా నా నటజీవితాన్ని కూడా ఒక మలుపు తిప్పింది. నాకు మంచి పేరు తెచ్చింది. అందరి కృషి ఫలించింది. 'క్లాసిక్' అనిపించుకున్న 'దేవదాసు' 'మాస్'ని కూడా ఆకట్టుకుంది. ఎన్నో ఉత్సవాలు
సత్కారాలు, సన్మానాలూ జరిగాయి. తమిళంలో కూడా అంత విజయం సాధించింది.
అప్పుడు తీవ్రంగా ఆలోచించుకున్నాను.నాకు బాధ్యత పెరిగింది..ఈ పేరు
నిలబెట్టుకోవాలి. ఇకమీదట కథలు, పాత్రలూ బాగా తెలుసుకుని, ఎన్నిక చేసుకుని చిత్రాల్లో నటించాలి.” అని ఒక నిర్ణయానికొచ్చాను.
                     సశేషం
                -అక్కినేని
              **************************
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'