★అక్కినే "మనసులోనిమాట" నిపార్ట్-30★

★అక్కినే "#మనసులోనిమాట" నిపార్ట్-30★ 
 నిర్మాత డి.ఎల్.నారాయణ గారు 'చిరంజీవులు'చిత్రానికి నన్ను అడిగారు. రెండు ట్రాజెడీ సినిమాలు కలిపిన కథ. 'కథ అంత మంచిది కాదేమో' అన్నాను. హీరో నాకు తగిన పాత్ర కాదన్నాను.
ఏ పాత్రయినా, నాకు ఉపయోగపడాలి. తర్వాత ప్రజల దృష్టిలో ఎలా వుంటాను? అని
ఆలోచిస్తాను. మొత్తానికి 'చిరంజీవులు' కూడా వద్దన్నానని డి.ఎల్.గారు మండి పడ్డారు
కృతఘ్నుడు. విశ్వాసంలేనివాడు" అని కూడా అన్నారు. పైగా ఈ సినిమా నేను
చెయ్యనన్నానని రామారావుగారితో కూడా చెప్పారు! అది నాకు మరింత కష్టం కలిగించింది. ఐతే, నాకున్నంత ఆలోచన, నిర్మాతలకు ఉండదా? నేను వారికంటే అధికుడినా? కాదు- ఎప్పుడూ కాదు. కాని, వ్యక్తిగతంగా ఆలోచించు కున్నప్పుడు కనిపించే
కారణాలు అడ్డం వస్తాయి. నేనంటే, డి.ఎల్.గారికి ఎంతో ఇష్టం! ఎంతో ప్రేమ! కాని
ఇలాంటి విషయాల్లో తప్పడంలేదు. అలాగే, 'ఏకవీర' తీదాం అన్నప్పుడు కూడా నేను
ఆ సినిమాలో నన్ను, రామారావుగారినీ పెట్టి తియ్యాలని ఆయన కోరిక ఒప్పుకోలేదు
ఇద్దరు హీరోలతో తీస్తే స్టార్ వాల్యూ వుంటుందని, సినిమాకి బలం వస్తుందనీ చెప్పారు.కథా పరంగా నాకు ఇష్టంలేదని మళ్లీ తప్పుకున్నాను
ఐతే, కన్నాశుల్కం, చిరంజీవులు కాదన్నానని డి.ఎల్.గారు కక్ష పెంచుకుని నాదగ్గరకు రావడం మానేశారా? మానేయరు. ఈ తిరస్కారాల కంటే అధికమైనది మా ప్రేమానుబంధం. అందుకే మళ్లీ 'దొంగల్లో దొర' సినిమాకు అడిగారు. చేశాను. అది నాఅరవయ్యో చిత్రం అయింది. అరవై చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజతోత్సవం
జరుపుకుని, నన్ను వృద్ధిలోకి తెచ్చిన నిర్మాతల్ని సత్కరించుకున్నాను. నా అరవయ్యోచిత్రం- డి.ఎల్.గారిదే కావడం, ఆనందకరమైన విషయం
 ★చిత్రంలో చిత్రం:నిర్మాత డి.ఎల్.నారాయణ
                 సశేషం...
                 -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'