అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-13



★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-13★ 
 #మహోన్నతమైన #పాత్రలిచ్చిన '#భరణి'
భానుమతిగారు, రామకృష్ణగారు - వారి అబ్బాయి భరణి పేరు మీద సంస్థ ఆరంభించి 'రత్నమాల' తీశారు. అందులో మంత్రి కుమారుడి పాత్ర వుంది. ఆ కంపెనీకి యల్. నారాయణగారే మేనేజరు. ఆయన రామబ్రహ్మంగారి దగ్గర కొచ్చి మంత్రి కుమారుడి పాత్ర నాచేత వేయించాలని అనుకుంటున్నారనీ, అందుకు అనుమతి ఇమ్మనీ అడిగారు. "నా అనుమతి ఎందుకు? తప్పకుండా వేయించండి. పెద్దవాళ్లతో
పరిచయం అవుతుంది. అనుభవం వస్తుంది” అని, ఆ మాటే నాతో చెప్పారు. నేను
సంతోషించాను. కథలో ఒక అందమైన ముఖం గల పటం నాయికకు చూపించి, కత్తితో
వివాహం చేస్తారు. నిజానికి అతను వరుడు కాడు. శోభన మందిరంలో ఆ మాట చెబుతాడు. ఐతే, ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగులుఏదో,నిలబడిఅప్పజెప్పినట్టున్నాయని, అప్పుడు పత్రికలు రాశాయి. కావచ్చు, అంతకంటె నటించడానికి అవకాశం లేదు. పాత్రస్వభావమే అంత. జరిగిన విషయం రాజకుమార్తెకు చెప్పడంలో అలాఅప్పజెప్పినట్టుగా వుండివుండొచ్చు, ఏదిఏమైనా, ఇలాంటి విమర్శలే, పాఠాలుఅవుతాయి. తొలి నుంచి నేను విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకున్నాను. నావ్యక్తిత్వ జీవితాన్ని విమర్శించడం కాదు. నటన పరంగా, పాత్రల పరంగా వచ్చే విమర్శలగురించి, తీవ్రంగా ఆలోచించడం నేర్చుకున్నాను. 'రత్నమాల' నాకు ఐదవ చిత్రం భానుమతిగారు, రామకృష్ణగారూ చెప్పినట్టుగా చేశాను..
ఆ దంపతులిద్దరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించినవారు. అద్భుతమైన పాత్రలు ధరింపజేసినవారు. 'లైలామజ్నా', 'విప్రనారాయణ', 'బాటసారి' వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలిచ్చి నా అభివృద్ధికి తోడ్పడినవారు. "లైలామజ్నా'లో "మజ్నా పాత్రని నేనేం చెయ్యగలను?" అని పరిశ్రమలోని వారంటే, వాళ్ల మాటలు లెక్కచెయ్యకుండా సాహసంతో ఆ పాత్రను నాకిచ్చిన దంపతులు వారు. భానుమతిగారి పక్కన నాయకుడిగా పర్సనాలిటీ దృష్ట్యాగాని, నటనా పరంగాగాని నేను నిలబడలేనని కొందరు భావించారు.
భానుమతిగారితో బి.ఎన్.రెడ్డిగారే అన్నారుట - 'నీ పక్కన తమ్ముడిలా ఉంటాడు అని, నేను కాకపోతే ఇంకెవరి చేత వేయించడానికీ ఎవరున్నారు గనక? అప్పుడు నాగయ్యగారు, సి.హెచ్.నారాయణరావుగారూ హీరోలు. వాళ్ల చేత వేయించలేరు కదా ఐతే, నేను భానుమతిగారి దగ్గర భయపడకుండా వుండాలని, నాకు బెరుకు పోగొట్టాలని ఆమెతో చనువుగా వుండడం కోసం, బీచ్ కీ, విహారాలకీ తీసుకెళ్లేవారు. 16 ఎమ్.ఎమ్ ఫిల్ము మీద షూట్ చేశారు. నాకు మళ్లీ ఒక పరీక్ష ఎదురైంది. పట్టుదలతో "మజ్నాపాత్రని నిర్వహించాలని తీర్మానించుకున్నాను. ఒక నటుడు, నటుడిగా నిలదొక్కుకుని మంచిపేరు తెచ్చుకోడానికి ఎన్ని అవస్థలు పడవలసి వస్తుందో అన్ని అవస్థలూ నేను పడ్డాను. 
ఈ అనుభవం నాకే ఎక్కువగా కలిగిందేమోనని నేను అనుకుంటాను. ఆఅనుభవమే పెద్ద పాఠమైంది. ఆ విమర్శలు, నిరుత్సాహాలే, నాలో పౌరుషాన్ని పెంచాయి.
మజ్నా పాత్ర స్వభావం అర్థమైందిగనక, అద్భుతమైన ఆ ప్రేమ కథలోని నా పాత్రని
బాగా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాను. రామకృష్ణగారు, భానుమతిగారు ఇచ్చిన సూచనల్ని తీసుకుంటూ, నా శక్తిని జోడించి నటించాను. అప్పుడు వేదాంతం రాఘవయ్యగారు ఆచిత్రానికి దర్శకత్వ శాఖలో కూడా పని చేశారు. రామకృష్ణగారికి సహాయకుడు. "మజ్నా
పిచ్చివాడయిన తర్వాత, నవ్వవలసిన పిచ్చినవ్వు నాకు సరిగా కుదరకపోతే రాఘవయ్యగారు నవ్వి చూపించేవారు. ఆ నవ్వుని ఆయన దగ్గర నేర్చుకున్నాను. 'లైలామజ్నావిడుదలయి విజయం సాధించింది. ఆ సాధనలో నేనూ ఒకభాగస్థుడనయినందుకు.
మహదానందపడ్డాను. "మజ్నా పాత్రని ఇంకా బాగా చేసి వుండొచ్చు" అని కొందరు వ్యాఖ్యానించినా నా పరిధిలో నేను చెయ్యగలిగానన్న తృప్తితో ఆనందించాను. లోపాలు వుండడం సహజం! మనం
చేసినదంతా గొప్ప కాదు! అదీ, ఆ దశలో, ఏమైనా, ఒక మంచి 'రొమాంటిక్ రోల్' నాకిచ్చి, నన్నొకహీరోగా నిలబెట్టారు ఆ దంపతులుఏ పాత్ర ధరించినా, దాన్ని అద్భుతంగా నిర్వహించానని నేనెన్నడూ భావించను చెడగొట్టలేదు కదా. చాలు. అదే మంచి పేరు తెస్తుంది.
                   (సశేషం)
                   -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'