అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-37"

★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-37★    

మంచి కథాబలం, తారాబలంతో 'దొంగరాముడు' విడుదలై - మంచి పేరు తీసుకొచ్చింది. మొదటి చిత్రంతోనే అన్నపూర్ణా సంస్థకి పేరు, స్థిరత్వం లభించాయి
కె.వి.గారు కచ్చితమైన నిర్మాణ విధానం రూపొందించడంతో, మధుసూదనరావుగారు
ఆ మార్గంలో, ఆ క్రమంలో తర్వాత చిత్రనిర్మాణం చెయ్యడానికి అవకాశం కలిగింది.
ఒక సినిమా విజయఢంకా మోగించిందంటే అది ఎంత ఆనందం పెంచినా అంతకంటే ఎక్కువగా బాధ్యతా పెంచుతుంది. "విజయసాధన ఎంత గొప్పదో, అంత చెడ్డది కూడా" అనిపిస్తుంది నాకు. 'రోజులు మారాయి', 'అనార్కలి', 'సంతానం' మిస్సమ్మ', 'అర్థాంగి' చిత్రాలన్నీ అఖండమైన విజయాలు సాధించాయి. ఆ కోవలో వచ్చిన 'దొంగ రాముడు' అమోఘమైన విజయం సాధించింది. ఈ విజయాలు నాకు
బాధ్యత పెంచినట్టే - అన్నపూర్ణా సంస్థకూ పెంచాయి. పై చిత్రాల తర్వాత వచ్చిన భలేరాముడు', 'చరణదాసి' కూడా బాగా నడిచాయి.
ఐతే, 'భలేరాముడు'లో నా పాత్ర దొంగ. నెగెటివ్ పాత్ర. అంతకుముందు సదారమ'లో దొంగ పాత్ర వెయ్యడానికి నిరాకరించినవాడిని, 'భలే రాముడు' ఎందుకు ఒప్పుకున్నాను? కారణం ఏమిటంటే - ఈ సినిమాకి మూల చిత్రం - హిందీలో వచ్చిన కీస్మత్'. 'కిస్మత్ లో ముఖ్యపాత్రధారి అశోక్ కుమార్. నేను అశోక్ కుమార్ అభిమానిని. ఆ సినిమా రెండుమూడు సార్లు చూశాను. అది దేశం అంతటాకూడా సూపర్ హిట్ అయింది. ఆ విధంగా అది, నిరూపించబడిన సినిమా గనక - నేను అందులో నటించడానికి సంశయించకుండా ఆనందంగా అంగీకరించాను. 'భలే రాముడు' సినిమా విడుదలయి, విజయవంతమైన తర్వాత, నాది దొంగ పాత్ర అన్న విషయం గురించి ప్రజలు పట్టించుకోలేదు. అది, పరాజయం పొందివుంటే - అప్పుడు అనేవారేమో నాగేశ్వరరావు దొంగగా నటించడం ప్రజలు మెచ్చుకోలేదు" అని. 'దొంగ రాముడు పేరులో దొంగ వున్నా, దొంగకాడు. చిన్నతనంలో తల్లికి మందు కొనడానికి డబ్బులు లేకపోతే, చిన్న దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఐతే, ఆ ముద్ర పెద్దయిన తర్వాత కూడా వెంటాడింది. కాని, ఘర్షణ పడేపాత్ర, ప్రేక్షకుల సానుభూతి పొందే పాత్ర. చెల్లెలు క్షేమంగా వుండాలని తన ఉనికి తెలియకూడదని జాగ్రత్తపడిన పాత్ర. కథని సానుభూతిపరంగా తీర్చిదిద్దడంలోనే దర్శక రచయితల ప్రజ్ఞ కనిపిస్తుంది.
                సశేషం
                -అక్కినేని
చిత్రాల్లో చిత్రాలు..
ఎడమవైపు పైన:దర్శకులు కె.వి.రెడ్డి
కుడివైపు పైన:నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు

       (ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'