★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-27★

★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-27★
  పాత్రలే ఏ నటుడికైనా నిండుదనం తెస్తాయి. నన్ను 'నట సమ్రాట్ అన్నా, 'మహానటుడు' అన్నా...
సృష్టించిన రచయితలదీ, తీర్చిదిద్దిన ఎంతోమంది టెక్నీషియన్లదీ, ఎక్కడో రామాపురంలో పుట్టినవాడికి, చదువు లేనివాడికి, సంస్కారం తెలియనివాడికి, ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాల దగ్గర్నుంచి ఆహ్వానాలు వచ్చాయంటే, అదంతా నా గొప్పదనమా? నా అదృష్టం కొద్ది నేను నటుడి నయాను. అలా కాకుండా, చదువుకుని వుంటే ఏ ఉద్యోగమో చేసుకుంటూ పొట్టపోసుకునే వాడినేమో! 
చదువు లేక పోవడం వల్లనే నాకు ఈ భిక్ష లభించిందా? మా అమ్మ ప్రోత్సాహంఆశీస్సులు లేకపోతే ఈ రంగంలోకి వచ్చి వుండేవాడినా? మా అన్న రామబ్రహ్మంగారుచొరవ చూపించకపోతే, ఈ రంగంలోకి వచ్చి వుండేవాడినా...!!
కారణం ఆ పాత్రలే. ఆ గొప్పదనం అంతా ఆ పాత్రలది, ఆ పాత్రల్నివీడిని చదివించే స్తోమత మనకి లేదు. చదువుకోవడానికి ఇక్కడ సదుపాయాలూలేవు.ఏదో నాటకాల్లో వేషాలు వేస్తున్నాడు, బాగానేవున్నాడు, వాడికీ ఉత్సాహం వుంది, ఉండనీ, ఎలాగోఒకలా నాలుగురాళ్లు సంపా యించుకోడానికి ఒక దారి దొరికిందిగదా" అంది అమ్మ- మాఅన్నయ్యతో, అది అమ్మ ఆశీస్సు, అమ్మ చెప్పిన ఆ దార్లోనే వెళ్లి- నాకు నేనుగా కాంక్రీట్ వేసుకున్నాను.
సత్పురుషుల సాంగత్యం లభించింది. విశాలమైన ప్రపంచం కనిపించింది. అంతులేని కళాసాగరాన్ని కనిపించిన మేరకు దర్శించగలిగాను.
                      సశేషం
                 -అక్కినేని
★★★★★★★★★★★★             
చిత్రంలోని చిత్రాలు...
ఎడమవైపు: అక్కినేని తల్లి పున్నమ్మ గారు..
కుడివైపు:అక్కినేని అన్న రామబ్రహ్మం గారు

(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు)

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'