అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-17
సంసారం'లో నా వేషం బాగుందనీ, నేను బాగా చేశాననీ చాలామంది ప్రశంసించినా, నేనూ తృప్తిపడినా వెంటనే ఏ సాంఘిక చిత్రంలోనూ అవకాశం రాలేదు
మళ్లీ 'తిలోత్తమ', 'సౌదామిని', 'మాయలమారి', 'స్త్రీ సాహసం', 'మంత్రదండం' లాంటి
జానపదాలే వచ్చాయి
వీటిలో 'సౌదామిని', 'మాయలమారి', 'స్త్రీ సాహసం' తమిళంలోకూడా వచ్చాయి. 'సౌదామిని' కడారు నాగభూషణంగారు తీశారు. మంచి నిర్మాతగా ఆయనకు పేరుంది. చాలాకాలంగా తెలిసిన వారు. అంచేత, ఆయన అడిగారని సౌదామిని'లో చేశాను
ఒక్కోసారి ఏ మొహమాటానికో, ఎవరికోసమో, ఎవరో గట్టిగా చెప్పడం వల్లనో కొన్ని కొన్ని ఒప్పుకోవలసి వస్తుంది. అలా ఒప్పుకున్నదే 'మంత్రదండం', అది ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచింది. అంజలీదేవిగారు, మేకప్ ఆర్టిస్ట్ గోపాలరావుగారు, నేనూ అలా
కొందరం కలిసి ఒక సినిమా తీద్దాం అనుకున్నాం గనక, 'మాయలమారి'లో నటించాను
స్త్రీ సాహసం' వినోదావారిది. డి.ఎల్.గారు అధినేత. ఈ సంస్థలోని భాగస్వాములందరూ
నా శ్రేయోభిలాషులే. వేదాంతం రాఘవయ్యగారు,సముద్రాలగారు, సుబ్బురామన్ గారూ...
ఆ రోజుల్లో హీరోకి కథ చెప్పడం, అతని అంగీకారం తీసుకోడం, అతను మార్పులు సూచిస్తే అవి శిరసావహించడం లాంటివేం లేవు. మామూలుగా తెలుసుకోవాలి కాబట్టి
కథ చెప్పేవారు అంతే..!!
నా మాతృసంస్థ లాంటి భరణివారు ప్రేమ' రెండు భాషల్లో తీశారు.
రెండింట్లోనూ నేను నటించాను. ఇది 'సంసారం' తర్వాత వచ్చిన సాంఘికం. పైగా హీరో పాత్ర. భానుమతిగారు నాయిక. 'లైలామజ్నా' తర్వాత మళ్లీ భానుమతిగారితోచెయ్యడం - మంచి అవకాశం.
ఏ నటుడైనా, నటుడిగా నిలదొక్కుకున్న తర్వాత, మంచి కథ, మంచి పాత్రల కోసం నిరీక్షిస్తూ వుంటాడు. మంచి అవకాశాలు కోసం ఎదురు చూస్తాడు. ఈ లోపల
ప్రేక్షకులకూ పరిశ్రమకూ దూరం కాకూడదు గనక, వచ్చిన చిత్రాలు చేస్తూ వుంటాడు.
ఒక్కోసారి క్లిష్టమైన పాత్రలు వస్తాయి. అవి ధరించి మెప్పించాలన్న తాపత్రయంలో
కృషి, దీక్ష పెరుగుతాయి. నా అనుభవంలో నాకు ఎదురైన సంఘనటలు చాలవరకు
సంశయాత్మకాలే! 'ఇలాంటి పాత్ర నాగేశ్వరరావు చెయ్యగలడా? చెయ్యలేడు! ఈ కథకి
ఆ పాత్రకీ అతను తగడు! అనవసరంగా నిర్మాత సాహసం చేస్తున్నాడు - ఏం మునిగిపోతాడో!' లాంటి వ్యాఖ్యానాలు ఎక్కువ. ఇలాంటివి నాకే ఎక్కువగా సంభవించడం నా దురదృష్టమో, లేక నా అదృష్టమో! ఆ దురదృష్టాన్నే అదృష్టంగా మలచుకుని పట్టుదల
పట్టడం - ఒక సవాల్! ఇలాంటి సవాలక్ష సవాళ్లను తొలి నుంచి ఆహ్వానిస్తూనే వున్నాను
ఎన్నడూ నిరుత్సాహపడలేదు, నీరస పడలేదు, క్రుంగిపోనూ లేదు. ఆ అనుభవాల్లో
వున్న 'త్రిల్'ని అనుభవించడంలో ఎంతో ఆనందం కూడా వుంది. నా మీద నమ్మకంవుండే గదా, దర్శకనిర్మాతలు నాకు పాత్రలిస్తారు? ఫలానా పాత్రకి నాగేశ్వరరావు పనికి రాడని వాళ్లనుకుంటే నా దగ్గరకే రారు గదా! వాళ్ల నమ్మకాన్ని నేనెలా వమ్ము చెయ్యగలను
అంజలి పిక్చర్స్ వారు సంస్థ ఆరంభించి, 'పరదేశి' రెండు భాషల్లో తీశారు.అందులో నేను వృద్ధుడిగా కూడా నటించాను. ముందు యువకుడు, తర్వాత తండ్రి. శివాజిగణేశన్ కొడుకు.. తొలిసారిగా నటించిన తండ్రిపాత్రని కూడా బాగానే నిర్వహించానని, అందరూ చెప్పుకున్నారు.
ఐతే, ఏదైనా - నాకు పేరొచ్చిందంటే ఆ పేరు నా ఒక్కడికే దక్కదు! ఏ నటుడూ
తాను ఒక్కడూ ఏమీ చెయ్యలేడు. ఆ చిత్రం దర్శకుడు, రచయిత, పాత్ర ఛాయాగ్రాహకుడు, మేకప్ మాన్- ఇలా అందరికీ ఆ ఖ్యాతిలో భాగం వుంటుంది. నటుడు ఎంత బాగా నటించినా, ఫొటోగ్రఫీలో అతని భావాలు కనిపించకపోతే ఏం లాభం?
అతని ముఖం అందంగా కనిపించకపోతే, ఏం లాభం? ఎందరో సహకరించాలి
ముఖ్యంగా దర్శకుడు తీర్చిదిద్దగల సమర్థుడై వుండాలి. ఇందరి సహకారంతో నటిస్తాడు
నటుడు, అంతేగాని - "నాది” “నేనే అంతా" అని భావించడం, మూర్ఖత్వం. ఎన్ని పాత్రలు చేసినా, “నేను బాగా చేశాను” అని నేను ఎన్నడూ చెప్పుకోలేదు. ఆ మాట ఇతరులు చెప్పవలసిన మాట. నేను మాత్రం ఆ పాత్రని "చెడగొట్టలేదు" అనే అను కుంటాను; అదే నా భావన....
(సశేషం)
-అక్కినేని
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment