అక్కినేని మనసులోనిమాట పార్ట్-18

 
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-18★
 పెద్దల ఆదేశాలు
అప్పుడు చాలా సినిమాలు రెండు భాషల్లోనూ తయారయేవి. "కీలుగుర్రం"
తమిళంలోకి డబ్చేస్తే ఘన విజయం సాధించడంతో, నేను తమిళ ప్రేక్షకులకి బాగా-
తెలిశాను.భరణీ వారి "#లైలామజ్నూ'తో (డబ్బింగ్) ఇంకా బాగా తెలిశాను. అటు తర్వాత రెండుభాషల్లోనూ ఏక కాలంలో చిత్రాలు తీసినప్పుడు రెండింట్లోనూ నేనే హీరోని. అప్పుడే క్షుణ్ణంగా తమిళం నేర్చుకున్నాను. నేను నటించిన తమిళ చిత్రాల్లో నేనే మాట్లాడానుగాని, నాకు డబ్బింగ్ లేదు. తమిళదేశంలో కూడా నాకు పేరుందని, నాతో తమిళచిత్రాలే తీశారు. అలా తెలుగు లేకుండా, తమిళంలో మాత్రమే తీసిన చిత్రాలు  'ఓర్
ఇరవు', 'అన్బుమగళ్', 'అతిశయ పెణ్', 'దైవమేతునై', 'ఎంగళ్ సెల్వి', "పెణ్మనం*
మొదలైనవి. వీటిలో కొన్నింటిని దరిమిలా తెలుగులోకి డబ్ చేశారు. నేను తమిళం
నేర్చుకున్నట్టే ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాను. బి.ఎన్.రెడ్డిగారు నన్ను ఎంతో ఆదరించేవారు.
నువ్వు నటుడిగా ఎదుగుతున్నావు. పదిమందినీ కలుసుకునే అవకాశాలు వస్తాయి. అంచేత,ఇంగ్లీషునేర్చుకో, ఇంగ్లీషులో మాట్లాడ్డం నేర్చుకో" అని సలహాఇచ్చి, రోజూ 'హిందూ' పత్రిక తెప్పించుకుని చదవమన్నారు. అటు తర్వాతనేనుఆంగ్లభాషలోమాట్లాడగలిగానంటే, అది బి.ఎన్.గారి సూచనే. నేను వచ్చిన తొలిరోజుల్లో బి.ఎన్.రెడ్డిగారు మంచిదర్శకుడనీ,గొప్ప దర్శకుడనీ చెప్పుకుంటూ వుంటే వినే వాడిని
అప్పట్లో 'గొప్ప దర్శకుడు' అంటే తెలిసేది కాదు, కానీకాజ వెంకట్రామయ్యగారి ద్వారా వరిచయం ఏర్పరుచుకుని తరచు ఆయన్ని కలిసేవాడిని.
బి.ఎన్.రెడ్డిగారు ఎన్నో విషయాలు చెప్పేవారు. వారితో నన్ను బీచికి తీసుకెళ్లేవారు. మంచి పుస్తకాలు, వాటిలోని పాత్రల గురించీ చెప్పేవారు. బెంగాలి, హిందీ చిత్రాల
ధోరణి, వారి నటనా విధానాలు, ఆంగ్ల చిత్రాల గురించి ఇలా ఎన్నో పనికొచ్చే విషయాలే మాట్లాడేవారు.
అర్థమైనా కాకపోయినా ఆంగ్ల చిత్రాలు చూడమనేవారు వాహిని స్టూడియో నిర్మాణ విధానం, చిత్రనిర్మాణవిధానం ఒకటేమిటి - చాలావిషయాలు ఆయనదగ్గర తెలుసుకున్నాను. నా భవిష్యత్తు చూడగలిగిన వారిలో ఆయన ఒకరు. నేనొక మంచి నటుడిగా, అవగాహనగల వ్యక్తిగా రూపొందాలని బి.ఎన్.గారుఆశించారు.తర్వాత ఎప్పుడోఆయనదర్శకత్వంలో"#పూజాఫలం'లోనటించాను. 
ఎందరో పెద్దల సాంగత్యం, వారిఅనుభవాలు, హితబోధలే నాకు పాఠాలు. సమగ్రమైన జీవితానికి కళాత్మకమైన రూపం కల్పించడానికి మహానీయుల సలహాలు,బోధలూ గ్రహించగలగాలనీ ఆచరణలో పెట్టగలగాలనీ అర్థం చేసుకున్నాను...
                      (సశేషం)
                   -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'