అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-19
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-19★
నటుడు కేవలం తన నటన, తను నటిస్తున్న పాత్ర మాత్రమే కాకుండా, లౌకిక విషయాలు, ప్రాపంచిక రీతులు, శాస్త్రజ్ఞానం వంటి వెన్నో తెలుసుకోవాలని, ఆ జిజ్ఞాస బాగా అవసరమనీ క్రమేణా తెలుసుకోగలిగాను. పాత్రధారణ చేసే వారికి ఇవన్నీ ఏం అవసరం? అని ప్రశ్నించుకోడానికి వీల్లేదు. వాటిలోంచే పాత్రలు
పుట్టాయి. ప్రతి పాత్రకీ సమాజంతో సంబంధం వుంటుంది. రామాయణ, మహాభారత కథలు తెలుసుకున్నాను. తెలుగులో వచ్చిన మంచి సాహిత్యం చదువుకున్నాను. పాత్రలు
వాటి మనస్తత్వాలు, విశ్లేషణ బాగా తెలియాలంటే, శరత్ సాహిత్యం చదవమని
కె.వి.రెడ్డిగారు చెప్పారొక సారి. #సముద్రాలరాఘవాచార్యగారు (చిత్రంలో) ఆ పుస్తకాలు తెప్పించినాకిచ్చారు. వీలు కల్పించుకుని చదివాను.
అప్పుడే 'దేవదాసు' చదివాను. 'దేవదాసు పాత్రని విశ్లేషించుకున్నాను కూడా. ఇది ఎవరైనా సినిమాతీస్తే?- ఏదో ఆలోచన.........
బ్రతుకు తెరువు' మంచికథ, మంచి సినిమా. సంఘర్షణ గల పాత్ర నాది వయ్యారి భామ'లో ఎందుకు నటించారు? అని అడిగారు అప్పుడు. కథ ఇలావుంటుందని చెప్పారు. వద్దనుకున్నాను. కాని, ఆ చిత్రనిర్మాత సుబ్బారావుగారి భార్య సులోచన మా అమ్మ దగ్గరకొచ్చి - 'ఎలాగైనా ఒప్పుకోమనండమ్మా' అని ప్రాధేయపడింది.పోనీలేరా ఆడకూతురొచ్చి అడుగుతోంది- చెయ్యి" అంది అమ్మ. అలాగే, అప్పుడే సౌదామిని'లో నటించమని అడిగితే, "బిజీగా వున్నాను కుదరదేమో" అని అంటే
#కన్నాంబగారు (చిత్రంలో)ఇంటికొచ్చి అమ్మ చేత చెప్పించారు. మొహమాటానికి సరే' అని రెండు చిత్రాల్లోనూ నటించాను. అపజయం పాలయాయి. నటించిన చిత్రం అపజయం పాలైతే, అందులో ఆ నటుడికి కూడా బాధ్యత వుందన్న మాటే. విజయసాధనలో పాలు పంచుకున్నప్పుడు, అపజయంలోనూ
పంచుకోవాలి. "సినిమా ప్రజాదరణ పొందలేదు నాకేం?” అని కూచోకూడదు. నేను నటించిన చిత్రాలన్నీ విజయవంతమైనవేనా? పరాజయం చూసినవీ ఎన్నెన్నో వున్నాయి. అలాంటప్పుడే నటుడికి బాధ్యత పెరుగుతుంది. "ప్రజల మెప్పు ఎందుకు పొందలేదు? ఇక మీదట జాగ్రత్తగా వుండాలి“అనుకోవాలి. హిట్ అయినప్పుడు కూడా బాధ్యత మరింత పెరుగుతుంది. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. ఇలాంటి భావాలన్నీ ఒక్కొక్కటీ నాకు తెలుస్తూ వచ్చాయి
(సశేషం)
-అక్కినేని
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment