అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-29★

★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-29★ 
 నటుడు ప్రేక్షకులమనిషి. ప్రజలతో ముడిపడి పున్నాడు. ఆ నటుడిని నటుడిగా చూసి జేజేలు పలికినా, తిరస్కరించినా ప్రేక్షకులే. అందుకని తన పట్ల ప్రజలకి ఉన్న ఉన్నత భావాన్ని నిలబెట్టుకోవాలి. నేను - 'దేవదాసు' సినిమాతో, నాకు లభించిన కీర్తిని తగ్గించుకోకూడదు. ఎలాంటి కథల్ని ప్రేక్షకులు ఆమోదిస్తున్నారో, ఎలాంటి పాత్రల్ని ఆదరిస్తున్నారో తెలుసుకుని అలాంటి పాత్రల్లో కనిపించాలి. అన్నీ హీరో పాత్రలే చెయ్యాలని కాదు, భిన్నమైన పాత్రల్లో కనిపించినా ప్రేక్షకులు హర్షిస్తారు. "చింతామణి'లో బిల్వమంగళుడుకీ, విప్రనారాయణుడికీ  కొంత తేడా వుంది.
విప్రనారాయణ సమగ్రమైన పాత్ర. బిల్వమంగళుడు ఒక విటుడు. విప్రనారాయణకి వచ్చినంత పేరు, మళ్లీ బిల్వమంగళుడికి రాదు. పైగా భానుమతిగారి వంటి మహానటిని చింతామణిగా
చూడలేరని నా ఉద్దేశం. ఇలా విశ్లేషించుకుని భరణి దంపతుల మాటని కాదనవలసివచ్చింది
తొలిసారిగా, ఇలా అంగీకరించకపోవడానికి గల కారణాల్లో వాళ్లూ ఒకరే కదా నిజానికి. మంచి ప్రజలుపాత్రలిచ్చి ప్రోత్సహించారుకదా. 'విప్రనారాయణ' ఇచ్చివుండకపోతే- అది వేరే విషయం. ఐతే వారు నా శ్రేయోభిలాషులు గనక, నేను 'చింతామణి'లో చెయ్యనన్నంత మాత్రాన, నా మీద కోపం తెచ్చుకోలేదు, కక్షపెట్టుకోలేదు. 'బాటసారి' లాంటి మంచి సినిమాలో మహత్తరమైన పాత్ర ఇచ్చారు కదా! అలా, ఈ సినిమాల్లో పరస్పరం అర్థం చేసుకోగలగాలి, ఎప్పుడో, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో పనిపడుతుంది
ఐతే, డి.యల్. గారికి మాత్రం నామీద కోపం వచ్చింది. బాగా వచ్చింది! 'కన్యాశుల్కం
తీస్తున్నాననీ, అందులో నన్ను గిరీశం చెయ్యమని అడిగినప్పుడు కాదన్నాను. గిరీశం పాత్ర కబుర్లు చెప్పి మాయ చేసే పాత్ర, ఇలాంటి లక్షణాలుగల పాత్రలు ముందే సినిమాల్లో వచ్చేశాయి కనుక పాత్రలో కొత్తదనం కనిపించదు. పైగా, అబద్ధాలూ మోసాలూ చేసే నెగిటివ్ పాత్ర. అది ధరించడం వల్ల నాకు, సినిమాకి కూడా ఉపయోగం వుండదని డి. ఎల్.గారికి చెప్పాను. "దేవదాసు లాంటి ఒక గొప్పపాత్ర ఇచ్చి, నటుడిగా నన్ను ఇంకో కోణంలో చూపించి, గిరీశం లాంటి పాత్ర చెయ్యమనడం భావ్యం కాదు" అన్నాను. ఆయన నొచ్చుకున్నారు. నేనూ నొచ్చుకున్నాను. "తల్లిప్రేమ' సినిమా తీసిన నాటి నుంచి ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. 'మనవాడేనే' అని భార్యతో అబద్ధం ఆడి ఇంట్లో భోజనం పెట్టినవారు. నా భవిష్యత్తు, శ్రేయస్సు కోరిన ఆత్మీయులు. అటువంటివారి మాట కాదని, బాధ పెట్టానే- అని బాధ పడినా- ఈ బాధల కంటే ముఖ్యమైనది ప్రేక్షకాదరణ, ప్రేక్షక బలం అని నమ్మి కాదనవలసి వచ్చింది
అలాగే సావిత్రి కూడా మధురవాణికి సరైన పాత్ర కాదని చెప్పాను. నాకున్న బలమైన
కారణాలు, నమ్మకాలూ నాకున్నాయి. ఆ జాగ్రత్తలో పెద్దలమాటని మన్నించ లేకపోయాను
         సశేషం...
          -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'