అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-23

 
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-23★
మళ్లీ విమర్శలు
వినోదాత్మకమైన చిత్రంగా భరణివారు'చక్రసాణి' తీశారు. అది బాగానే నడిచిన తర్వాత, 'విప్రనారాయణ ప్రారంభించాలని, ఆ పాత్రను నాకివ్వాలనీ తీర్మానం చేసుకున్నారు. నేను ఎంతో సంతోషించాను. మళ్లీ మరొక సవాల్ ఎదురైందన్నమాట. మొదటిసారిగా నేను ధరిస్తున్న ఒక బ్రాహ్మణ పాత్ర. భక్తుడి పాత్ర మళ్లీ విమర్శనాత్మకమైన మేఘాలు కమ్ముకున్నాయి. “ఏదో 'దేవదాసు' చేసి గట్టెక్కాడు. 'విప్రనారాయణ' అలాంటిది కాదు. ఇది ఎలా చెయ్యగలడు?"అన్న   ఊహాగానాలు వినిపించాయి. “నీకు దైవభక్తి లేదు. నువ్వు భక్తుడివి కావు విప్రనారాయణుడు గొప్ప భక్తుడు. ఆ పాత్ర నువ్వు ఎలా చేస్తావు?" అని కె.వి.రెడ్డిగారే అడిగారు నన్ను. నేను మొండిగా వాదించాను. నటుడన్న వాడు ఏదైనా నటించాలి గదా భక్తి లేకపోతే భక్తుడిగా నటించలేడా? తాగుబోతు పాత్ర వేసినవాడు, తాగుబోతయివుండాలా? తను కానిదాన్ని, తనలో లేనిదాన్నీ ఊహించుకుని ఆ పాత్ర నిర్వహించడమేకదా, నటన అంటే కొందరు భానుమతి గారితోనూ రామకృష్ణ గారితోనూ నేను విప్రనారాయణ పాత్రకి పనికి రానేమో - అని చెప్పారు. నాతో కూడా చెప్పారు. "నువ్వు హీరోవి. ప్రజల్లో గ్లామర్ సంపాదించుకున్నావు. గుండుతో వున్న ఈ బ్రాహ్మణ పాత్ర వేసి, గ్లామర్ అంతా పాడు చేసుకుంటావా" అని అడిగిన వాళ్లూ వున్నారు. నటుడన్న వాడు తన రూపురేఖలకి తగ్గట్టు- అన్నిరకాల పాత్రలూ చెయ్యుగలగాలి. చెయ్యాలి. నా రూపం కొన్ని పురాణపాత్రలకి చెల్లుబాటు కాదు. ముక్కు, మొహం తీరుగా దృష్ట్యా చూస్తే పొట్టిగా వుంటాను. భారీ ఆకృతి కాదు. పురాణాల్లో వర్ణించినట్టు ఆజానుబాహుడిని కాదు. కె.వి.రెడ్డిగారు 'శ్రీ కృష్ణార్జున యుద్ధం' ఆరంభించే ముందు నన్ను కృష్ణుడి వేషం చెయ్యమని అడిగారు. రామారావుగారు అర్జునుడు. మా పర్సనాలిటీల
వున్నా రూపం ప్రకారం - ఆయన ఊహ నిజమే. కాని, నేను ఒప్పుకోలేదు. కృష్ణుడి వేషానికి పొట్టిపొడుగులు అడ్డు రావు గాని, అర్జునుడికి అడ్డు వస్తాయి. అర్జునుడు మహావీరుడు
ఎగు భుజాలతో ఎత్తుగా వుంటాడని పౌరాణికులు రాశారు. కె.వి.గారి లెక్కలో
రామారావుగారు అర్జునుడు, నేను కృష్ణుడు సమంజసమే. కాని, 'మాయాబజార్'లో
రామారావుగారు కృష్ణుడు వేస్తే, కృష్ణుడంటే ఆయనే అని, ప్రేక్షకజనం తీర్మానించారు
ఆ మాటే అన్నాను. “మీరు ఆయన్ని కృష్ణుడిగా బాగా పాపులర్ చేశారు. ఇప్పుడు నేను
వేస్తే ప్రజల దృష్టిలో అసమంజసమవుతుంది. నన్ను, ఆయన కృష్ణుడితో సరి పోల్చారనుకోండి--బాగులేదనిపించు కున్నాననుకోండి - దెబ్బ కొడుతుంది. దానివల్ల నాకు పోయేదేంలేదు.  మీకే నష్టం కలుగుతుంది. జయంతి సంస్థకి, మీరు "పెళ్లినాటి ప్రమాణాలు' తీశారు. అంత ప్రోత్సాహకరంగా నడవలేదు. మళ్లీ ఇలాంటి పొరపాటు చెయ్యడం ఎందుకు?
మీరు ఆలోచించండి..నేను కృష్ణుడికి బాగుండనని కాదు. ఆయన ఆ పాత్రకి స్థిరత్వం సంపాదించుకున్న తర్వాత, ఆయన పక్కన నేను వేస్తే ఇబ్బందుల్లో పడతాం. సినిమాలో రామారావుగారు లేరనుకోండి, నేను కృష్ణుడనుకోండి. అది వేరే విషయం. మీరు ఉద్దేశించినట్టు రామారావుగారు అర్జునుడు సబబే కాని ఈ పరిస్థితిలో మాత్రం కాదని నా అభిప్రాయం" అని, వాదించి కె.వి.గారిని ఒప్పించాను       
                సశేషం
                 -అక్కినేని
  ★ చిత్రానికి పైన ఉన్న చిత్రాలు★
కుడివైపు:చక్రపాణిలో ఏ.ఎన్. ఆర్..
ఎడమవైపు:విప్రనారాయణలో ఏ.ఎన్. ఆర్.
   ★చిత్రానికి క్రింద ఉన్న చిత్రాలు...★
కుడివైపు: దర్శకులు శ్రీ కె.వి.రెడ్డి
ఎడమవైపు:నటీమణి భానుమతి **************************
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'