★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-24★

★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-24★
 'కృష్ణార్జునయుద్ధం' లో నాకు కృష్ణుడిగా వచ్చిన అవకాశాన్ని- రామారావుగారికి వున్న పాపులారిటీ దృష్ట్యా- వద్దనుకున్నాను. అంతకుముందు 'చెంచులక్ష్మి'లో విష్ణువు వేషం వేశానుగదా...ఆ సినిమా ఘన విజయం సాధించింది కదా. ఐతే, విష్ణువు ఆజానుబాహుడని ఎక్కడాలేదు. వీరత్వం శూరత్వం, పౌరుషంగల పాత్రలకే ఆ రూపం నిర్దేశించారు. ఎప్పుడైతే- రామారావుగారు రాముడి పాత్రకీ, కృష్ణుడి పాత్రకీ అచ్చుగుద్దినట్టు సరిపోయారో- ప్రజలు ఏ పాత్రల ద్వారా ఆయన్ని అరాధిస్తున్నారో- దాన్ని వ్యతిరేకించకూడదు.అలాగే, ఎమ్.ఎ.వి. వారు తమిళంలో 'సంపూర్ణ రామాయణం' ఆరంభిస్తూ నన్ను రాముడి పాత్ర చెయ్యమని అడిగారు. నేను వెంటనే తిరస్కరించాను. "రాముడంటే రామారావుగారే. ఆయన చేతనే వేయించండి. చిత్ర విజయానికీ, ఆ పాత్రకీ ఆయనే నూటికి నూరుపాళ్లు" అని చెప్పాను. 
అప్పుడు రామారావుగారే ఆ పాత్ర చేశారు సి.పుల్లయ్యగారు 'లవకుశ' ఆరంభిస్తూ ఇద్దరు హీరోలుంటే బావుంటుందని, నన్ను లక్ష్మణుడు వెయ్యమన్నారు. "లక్ష్మణుడిలో సింపతీ వుంది- మిలాంటి వాళ్లు వేస్తే సినిమాకి
మేలు జరుగుతుంది” అన్నారు.నేనంటే ఆయనకి ఇష్టమే. ఆయన దగ్గర ఏ చిత్రమూ చెయ్యలేదనుకోండి. కారణాలు చర్చించలేదుగాని, 'వద్దులెండి' అని తప్పుకున్నాను.

చెంచులక్ష్మి'లో నేను నటిస్తున్నప్పుడు ఒకసారి రామారావుగారు సెట్టుకొచ్చారు.
నేను విష్ణుమూర్తి వేషంలో కూచుని సిగరెట్టు కాలుస్తున్నాను. ఆయన ఒక్కసారి బిత్తరపోయి
చూసి, “అదేమిటి బ్రదర్! ఈ పాత్ర చేస్తూ సిగరెట్టు కాలుస్తున్నారు?” అని అడిగారు.
తప్పేమిటి?" అని అడిగాను, “విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలుండడం తప్పు కాదా?"
అన్నాను నవ్వుతూనే. ఆయన నమ్మకాలు ఆయనకున్నాయి. ఆయన దేవుడు పాత్రలు
చేస్తునప్పుడు నిష్ఠగా వుంటానని చెప్పారు. ఆయన దృష్టిలో పవిత్రమైన పాత్రలు
ధరిస్తునప్పుడు, ఆ పవిత్రతని బయటకూడా ఆచరించాలని ఉద్దేశపడతారు. నేను అలా
అనుకోను. 'వేషంలో వున్నాను గదా' అనుకుంటాను.
                సశేషం
              -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'