★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-15

 
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-15★ 
 'బాలరాజు" సినిమా అంతకుముందున్న కొన్ని
చిత్రాల వసూళ్లని అధిగమించింది.
సంవత్సరం తర్వాత 'కీలుగుర్రం' వచ్చింది. ఇందులో నాది రాకుమారుడి
పాత్ర, సాహసాలు వున్నాయి. శృంగారం వుంది. మాయలు, మంత్రాలు, భూతాలూ
అన్నీ వున్నాయి. ఇది కూడా ఘనవిజయం సాధించింది. 'కీలుగుర్రం' చిత్రానికి లభించిన
ప్రజాదరణని పురస్కరించుకుని తమిళంలోకి 'డబ్' చేస్తే అక్కడ కూడా శతదినోత్సవాలు
చేసుకుంది. తమిళంలోకి 'డబ్' చెయ్యబడిన తొలి తెలుగు చిత్రం 'కీలుగుర్రం', ఆ
చిత్రం శతదినోత్సవానికి వెళ్లి 'షీల్డ్' అందుకోడంలో ఎంతో ఆనందం పొందాను. ఈ
రెండు జానపదాలూ మారు మూలగ్రామాల్లో వున్న పామర జనాన్ని కూడా అమితంగా
ఆకర్షించాయి. వరసగా వచ్చిన రెండు సినిమాలూ అమితమైన విజయాన్ని
సాధించడంతో- ఎక్కడెక్కడో వున్న పల్లె ప్రజానీకానికి కూడా 'అక్కినేని నాగేశ్వరరావు
బాగా తెలిశాడు. జానపద చిత్రాల నాయకుడిగా నేను ప్రజా హృదయాల్లోస్థిరనివాసం
సంపాదించుకో గలగడానికి ఈ సినిమాలు రెండూ ఎంతో దోహదం చేశాయి
ఏ నటుడి విజయమైనా- అది ఆ సినిమా పొందిన విజయమే. ఎంత గొప్ప
పాత్రయినా- ఆ నటుడు ఎంత బాగా నటించినా- ఆ చిత్రం విజయం సాధించాలి
ప్రజలు ఆదరించకపోతే, ఆ పాత్ర, ఆ నటన అన్నీ వృధా అయిపోతాయి. 'దేవదాసు
 సినిమాలో నా నటనకు అంతటి ఖ్యాతి పొందగలిగానంటే ఆ చిత్రం అన్నివర్గాల
ప్రేక్షక హృదయాల్నీ స్పందింపజేసింది! నిజానికి ఆ చిత్రం ఒక క్లాసిక్! ఆ ముద్రలో
అది ప్రజాదరణ పొందకపోయివుంటే 'దేవదాసు' పాత్ర నిర్వహణ గురించి, ఇంతగా
చెప్పుకునే వారు కాదేమో
బాలరాజు, కీలుగుర్రం సినిమాలు రెండూ నన్ను 'మాస్ హీరో'గా ముద్ర
వెయ్యడంతో 'రక్షరేఖ', 'పల్లెటూరిపిల్ల', 'పరమానందయ్య శిష్యులు', స్వప్నసుందరి'
మొదలైన జానపద కథలే నన్ను వరించాయి. మధ్యలో 'లైలామజ్నా' భిన్నత్వం
చూపించింది
ఐతే జానపద నాయకుడంటే- ఎలా వుండాలి? ఎలా వుంటే ఆ పాత్రని
ప్రజలు ఆదరిస్తారు? అన్నది 'పాతాళభైరవి' చిత్రం చెప్పింది. ఎవరూ చెయ్యలేని
సాహసాలు చెయ్యాలి. యుద్ధాలు చెయ్యాలి. జయించాలి. అనుకున్నది సాధించాలి. ఇది
సామాన్య జనానికి హత్తుకునే ఆంశం. హీరో సాహస కార్యాలు చూసి ప్రజలు "ఆహా!
అనాలి, ఈ ప్రాతిపదిక మీదనే తర్వాత వచ్చిన చాలా జానపద చిత్రాలు ఆధారపడ్డాయి
శ్రీలక్ష్మమ్మ కథ' ఒక ప్రాంతంలో ప్రచారంలో వున్న కథ, ఆ కథ కోసం
పోటీపడి రెండు సంస్థలు సినిమాగా నిర్మించాయి. బలరామయ్యగారు స్వప్నసుందరి'సినిమా తర్వాత ఆ కథ తియ్యాలని స్క్రిప్టు సిద్ధం చేసుకున్నారు. కాని, కృష్ణవేణిగారు లక్ష్మమ్మ' పేరుతో అదే కథని సినిమాగా మొదలు పెట్టడంతో, 'స్వప్న సుందరి'ని అపుచేసి, శ్రీలక్ష్మమ్మకథ' ప్రారంభించారు. ఒకరిమద ఒకరికి పోటీ పెరిగింది. "ముందు
మా సినిమా రావాలి' అంటే,'మాది రావాలి' అనుకున్నారు. ఆ పోటీలోరాత్రులు  పగళ్లు పని చెయ్యాల్సి వచ్చింది. ఒక్క బలరామయ్యగారే కాకుండా ఇతరులు కూడా కొన్ని దృశ్యాలు
తీస్తే, నాణ్యతని ఎంతవరకూ నిలబెట్టగలం? అన్న ఆలోచనకి ఆస్కారంలేదు. నా పాత్ర
వైవిధ్యం వున్న పాత్ర, ఆ పాత్ర స్వరూపం స్క్రిప్ట్ లో వుంది గనక, అది చదువుకుని, ఆ
ప్రకారం నటించాను. నాకు జన్మనిచ్చిన సంస్థ ప్రతిభా. అక్కడ ఏం చెబుతే అది
అచరించవలసిందే. సూచనలు, హెచ్చుతగ్గులు సవరణలూ చెప్పేవాళ్లులేరు గనక, పాత్ర
స్వభావాన్నిబట్టి, నేనే నటించుకుంటూ వెళ్లాను. ఆ పాత్ర జానపద పాత్రలాంటిదీ కాదు
పురాణం కాదు, 'లైలా మజ్నా'లాగా ప్రేమికుడు కాదు, 'కీలుగుర్రం'లోలాగా సాహసీకాదు:
భిన్న స్వరూపం గల పాత్ర. మొత్తానికి బాగానే వుందన్నారు. ఆ సమయంలో నాకొక
కొత్త విధానంలో వున్న పాత్ర లభించడం- అదృష్టం. ఒకే రకమైన పాత్రలు నటించడంవల్ల
నటుడికి రాణింపు దొరకదు. వేసేది నాయక పాత్రే అయినా, అందులో కొంత వైవిధ్యం
తీశారు. 19రోజుల్లో సినిమా పూర్తయింది! అంత హడావుడి పడి, సినిమా
కూడా వుండాలి. అప్పుడే పాత్రధారణకి అవగాహన, ఆలోచన అవసరమవుతాయి
ఐతే, అంతవరకూ నాకు సాంఘిక చిత్రంతో పరిచయం ఏర్పడలేదు. వస్తున్నవన్నీ
ఎక్కువగా జానపదాలే. జానపదాల్లోనే వేస్తూ వుంటే, సాంఘికాలకి నేను పనికి రాకుండా
పోతానా? ఆ అవకాశం ఎప్పుడొస్తుంది? - అదొక ఎదురు చూపు...
                 సశేషం)
                   -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'