★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-32★

★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-32★ 
ఇంకొక మంచి పాత్ర
ఎన్.టి.రామారావుగారు, నేనూ
అప్పటికి కలిసి నటించిన చిత్రాలు పల్లెటూరి పిల్ల', 'సంసారం', 'మిస్సమ్మ'ల తర్వాత తెనాలి రామకృష్ణ' వచ్చింది. అందులో నన్ను రామకృష్ణ కవి వెయ్యమని బి.ఎస్.రంగా గారు అడిగినప్పుడు చిన్న సందేహం తలెత్తింది
తెనాలి రామలింగడంటే వికటకవిగా ప్రసిద్ధుడు. ఏవేవో హాస్య చేష్టలు చెయ్యడం కవుల్నీ, కృష్ణదేవరాయల్నీ ఆట పట్టించడం లాంటివే ప్రచారంలో పున్నాయి. ఆ మాట అడిగితే, "అలాకాదు. చాలా పెద్ద తరహాలో ప్రవర్తించే పాత్రగా మలిచాము" అని పాత్ర తీరు చెప్పారు. విన్న తర్వాత మంచి ట్రీట్ మెంట్ ఇచ్చారనిపించింది. తన చాకచక్యంతో, రాజకీయ సమస్యల్ని కూడా పరిష్కరించే స్థాయిలో రామకృష్ణుడి పాత్రను
తీర్చిదిద్దారు. సముద్రాల రాఘవాచార్యగారు నిండుదనంగల పాత్రగా, నటించడానికి అవకాశం వున్న పాత్రగా ఎంతో చక్కని సంభాషణలతో రూపొందించారు. చిత్రం విడుదలానంతరం రామకృష్ణుడి పాత్రకి సంపూర్ణత్వం వచ్చిందనీ, నేను చక్కగా అభినయించాననీ, పరిశ్రమలోని వారూ అభిమానులూ అందరూ అభినందించారు
తెనాలి రామకృష్ణ' నా నట జీవితంలో ఒక మంచి చిత్రంగా నిలబడింది.
రామారావుగారు,భానుమతిగారు ముఖ్యపాత్రలు చెయ్యడంవల్ల సినిమాకి పరిపూర్ణత్వం సిద్దించింది. పాత్రలన్నీ బాగున్నాయి. చక్కగా, నిర్దిష్టంగా నిర్మించారు దర్శక నిర్మాత బి.యస్.రంగాగారు. అటు తర్వాత రంగాగారు, 'అమరశిల్పి జక్కన', 'వసంత సేన'లాంటి మంచి చిత్రాలు నిర్మించారు. జక్కన పాత్ర కూడా నటించడానికి ఎంతో అవకాశం వున్న పాత్ర. ఆ చిత్రం కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 'వసంత సేన' నాకు ఎంతో ఇష్టమైన కథ. విశిష్టమైన కథ. క్లాసిక్. తియ్యడం బాగానే తీశారు. ఎక్కడ లోపంవుందో గాని, ఆ సినిమాకి అంత ప్రజాదరణ లభించలేదు
సెంటిమెంటల్ పాత్రలతో తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు నిర్మించిన 'బంగారు గాజులు', 'ధర్మదాత' మంచి చిత్రాలు. 'ధర్మదాత' రసభరితమైనపాత్ర. నటనకు ప్రాధాన్యం వున్న పాత్ర. ద్విపాత్రాభినయం గల చిత్రం ఇది. చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఈ రెండూ చెప్పుకోవచ్చు.
                     సశేషం...
                 -అక్కినేని
★చిత్రంలో చిత్రాలు★
ఎడమవైపు పైన;వసంతసేన లోని చిత్రం
కుడివైపు పైన:అమరశిల్పి జక్కన్న లోని చిత్రం
ఎడమవైపు క్రింద: రచయిత సముద్రాల రాఘవాచార్య
కుడివైపు క్రింద:తెనాలి రామకృష్ణ నిర్మాత బి.ఎస్. రంగా

(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'