అక్కినేని"మనసులోని మాట"పార్ట్-
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-21
దేవదాసు సినిమాలో తాగుడు దృశ్యాల్లో నేను తిండి మానేసి, కళ్లు లోతు చేసుకుని నటించానని కొందరు భావించారు. అదేమి కాదు. నా సూచన మీదనే, ఆ దృశ్యాలన్నీ రాత్రులు షూట్ చేశారు. రాత్రి బాగా పెరుగు అన్నం తిని, నిద్ర మత్తును తట్టుకుంటూ అరమోడ్పు కళ్లతో నటించడం వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చింది. తాగుడుకి బాగా బానిసయిపోయిన తర్వాత మంగయ్యగారు చేసిన మేకప్, రంగాగారి లైటింగ్ ఎంతో సహకరించాయి.
మంగయ్యగారు చేతి వేళ్లకు కూడా మేకప్ చేశారు
దేవదాసు బలహీనుడు. సాహసికాడు, మానసిక వ్యధ అనుభవించే నాయకుడు
పార్వతి, చంద్రముఖి మంచి పాత్రలు. ఐతే 'దేవదాసు' మూలకథలో వున్నట్టుగా
కాకుండా, సినిమాకి చిన్న మార్పులు చేశారు. నవలలో పార్వతి, దేవదాసులు బాహాటంగా ప్రేమించుకోలేదు. ఒకరికొకరు చెప్పుకోలేదు. కాని, సినిమాలో ప్రేమికులుగానే చూపించారు. ఒక సన్నివేశంలో పార్వతితో "ఉన్న సిగ్గు అంతా ఇప్పుడే పడిపోతే మరిపెళ్లినాడో?" అంటాడు దేవదాసు. అప్పుడు నేను డి.ఎల్.గారిని అడిగాను - "మూలకథలో ఇలా లేదు కదా ఎందుకీ మార్పు చేశారు?" అని. “వాళ్లకి ఒకరి మీద ఒకరికి ప్రేమ వుంది. ఉందని పాఠకులకి తెలుసు. అది నవల. నవలలో వున్నట్టు అంత సైకలాజికల్గా తీస్తే ప్రేక్షకులకి అర్థంకాదు. శృంగారపరంగా మార్చకపోతే మరీ 'క్లాసిక్' ముద్ర పడిపోతుంది. ఐనా, 'దేవదాసు'ని చదివిన వాళ్లు ఎంతమంది వుంటారు గనక? అంచేత ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్టుగానే చూపిస్తున్నాం' అని చెప్పారు డి.ఎల్.గారు.
సశేషం
-అక్కినేని
★చిత్రంలో చిత్రాలు
1. నిర్మాత.. డి.ఎల్ నారాయణ
2.దర్శకులు.. వేదాంతం రాఘవయ్య
3.సంగీతం:సి.ఆర్ .సుబ్బరామన్
4.మాటలు..పాటలు:సముద్రాల రాఘవాచార్య
5.చంద్రముఖి; లలిత
6. పార్వతి:సావిత్రి
7.నేపధ్యనంగానం:ఘంటసాల
**************************
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment