అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-20

 
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-20★
 నేను ఎగిరిగంతేసిన వార్త..!! 
డి.ఎల్.గారు #దేవదాసు తీస్తానన్నారు. అజరామరమైనఆ పాత్రను నాకిస్తామన్నారు. సావిత్రి పార్వతి. దర్శకుడు వేదాంతం రాఘవయ్య. అంతే సినిమాలోకం అంతా కాకుల్లా కూసింది... !! అందరూ ముక్కున వేలేసుకున్నారు. పరిశ్రమలో పెద్ద దుమారం లేచి గాలివాన వీచినట్టయింది. నాగేశ్వరరావు దేవదాసా..? పార్వతి పాత్ర సావిత్రా..? జానపదాలు తీసుకునే వేదాంతం రాఘవయ్య 'దేవదాసు'ను డైరక్టు చేస్తారా దీంతో వినోదా సంస్థ, డి.ఎల్ గారు, అందరూ కొట్టుకుపోడం ఖాయం..! - ఇదీ పరిశ్రమలో స్పందన... వేళాకోళాలు, వెక్కిరింతలూ మొదలైనాయి. ఇవన్నీ మా అందరికీ తెలిశాయి
ఏమైనా సరే .., 'దేవదాసు' తీద్దాం, కష్టపడదాం ., కృషి చేద్దాం" అని పట్టుబట్టారు.
డి.ఎల్.గారు. కొందరు ప్రోత్సహించినా, కొందరు మాత్రం "దేవదాసు' ట్రాజడీ. హీరో
హీరోయిన్లిద్దరూ చ్చిపోతే ఎవరు చూస్తారు? విషాదమైన కథ ఎవరిక్కావాలి?" అన్నారు
చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు కూడా "ఆ బరువు నువ్వు మొయ్యలేవు
చిరంజీవీ అన్నారు నాతో. బి.ఎన్.రెడ్డిగారు మాత్రం - "చాలా మానసిక క్షోభ అనుభవించే
పాత్ర, నిజమైన ప్రేమికుడి పాత్ర, సంఘర్షణ గల పాత్ర. నటజీవితాన్ని 'మోల్డ్' చేసే పాత్ర. బాగా స్టడీ చేసి, చెయ్" అని ప్రోత్సహించారు. ఐతే, ఎక్కువగా వచ్చినని విమర్శలే
ఆ నిరుత్సాహపు అలల నుధ్య చిక్కుకోకుండా, ఏటికి ఎదురీదాలని నిశ్చయించుకున్నాను.
దేవదాసు' కథని, పాత్రనీ మళ్లీ మళ్లీ చదినాను. ఆ పాత్ర ఎందుకు ప్రేక్షకుల సానుభూతి పొందదో చూద్దాం- అని మొండి పట్టుదల .. శరత్ నవలల్ని తెలుగులోకి అనువదించి శరత్ పాత్రల ధోరణిని, మనస్తత్వాన్నీ బాగా తెలిసి పున్న చంద్రపాణిగారితో కూచుని
చర్చించాను. తొలినాటి రోజులకీ, ఈ రోజులకీ నాలో తేడా వుంది. నా తొలి సాంఘికం సంసారం'లో నటిస్తున్నప్పుడు, కాస్త బెదురుతూ 'నా పాత్రధారణని మెచ్చుకుంటారా అన్నట్టుగా చేశాను. కాని, దేవదాసు' పాత్రని మాత్రం "నేను నటించగలను, నటిస్తాను'అని ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. ఒక పక్క రాఘవయ్యగారు, సముద్రాల గారు కథనం మీద చర్చలు చేస్తున్నారు. ప్రేక్షకుల సానుభూతి పోందెలా రూపొందించాలి? - అని నేను మధనపడుతున్నాను. ఒక పక్క కష్ట సాధ్యమయిన పాత్ర. ఇంకో పక్క విమర్శల తాకిడి! ఈ రెండూ మోసుకుంటూ, దైర్యంతో మొండితనం పట్టుదలతో కృషి చేశాను. నటీనటులు, టెక్నీషియన్స్ అందరిలోనూ ఒకే పట్టుదల. గట్టిగా ఈ 'చాలెంజ్'ని ఎదుర్కోవాలి. కథలో మంచి ఎమోషనల్ డ్రామా వచ్చింది. మంచి సంగీతం కుదిరింది. పాత్రలకి నిండుదనం, నిబ్బరం వచ్చాయి. ఎవరికి వారు 'ఇది మనది' అన్నట్టుగా కృషి చేశారు. దేనికైనా మన కృషి మనం చేస్తాం. ఫలితం చెప్పవలసింది ప్రేక్షకులు...(సశేషం)
                   -అక్కినేని
                 
★చిత్రానికి కుడివైపు: నిర్మాత డి.ఎల్ నారాయణ
★చిత్రానికి ఎడమవైపు:దర్శకులు వేదాంతం రాఘవయ్య  
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'