★అక్కినే "మనసులోనిమాట" నిపార్ట్-30★
★అక్కినే "#మనసులోనిమాట" నిపార్ట్-30★ నిర్మాత డి.ఎల్.నారాయణ గారు 'చిరంజీవులు'చిత్రానికి నన్ను అడిగారు. రెండు ట్రాజెడీ సినిమాలు కలిపిన కథ. 'కథ అంత మంచిది కాదేమో' అన్నాను. హీరో నాకు తగిన పాత్ర కాదన్నాను. ఏ పాత్రయినా, నాకు ఉపయోగపడాలి. తర్వాత ప్రజల దృష్టిలో ఎలా వుంటాను? అని ఆలోచిస్తాను. మొత్తానికి 'చిరంజీవులు' కూడా వద్దన్నానని డి.ఎల్.గారు మండి పడ్డారు కృతఘ్నుడు. విశ్వాసంలేనివాడు" అని కూడా అన్నారు. పైగా ఈ సినిమా నేను చెయ్యనన్నానని రామారావుగారితో కూడా చెప్పారు! అది నాకు మరింత కష్టం కలిగించింది. ఐతే, నాకున్నంత ఆలోచన, నిర్మాతలకు ఉండదా? నేను వారికంటే అధికుడినా? కాదు- ఎప్పుడూ కాదు. కాని, వ్యక్తిగతంగా ఆలోచించు కున్నప్పుడు కనిపించే కారణాలు అడ్డం వస్తాయి. నేనంటే, డి.ఎల్.గారికి ఎంతో ఇష్టం! ఎంతో ప్రేమ! కాని ఇలాంటి విషయాల్లో తప్పడంలేదు. అలాగే, 'ఏకవీర' తీదాం అన్నప్పుడు కూడా నేను ఆ సినిమాలో నన్ను, రామారావుగారినీ పెట్టి తియ్యాలని ఆయన కోరిక ఒప్పుకోలేదు ఇద్దరు హీరోలతో తీస్తే స్టార్ వాల్యూ వుంటుందని, సినిమాకి బలం వస్తుందనీ చెప్పారు.కథా పరంగా నాకు ఇ...