అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-13
★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-13★ #మహోన్నతమైన #పాత్రలిచ్చిన '#భరణి' భానుమతిగారు, రామకృష్ణగారు - వారి అబ్బాయి భరణి పేరు మీద సంస్థ ఆరంభించి 'రత్నమాల' తీశారు. అందులో మంత్రి కుమారుడి పాత్ర వుంది. ఆ కంపెనీకి యల్. నారాయణగారే మేనేజరు. ఆయన రామబ్రహ్మంగారి దగ్గర కొచ్చి మంత్రి కుమారుడి పాత్ర నాచేత వేయించాలని అనుకుంటున్నారనీ, అందుకు అనుమతి ఇమ్మనీ అడిగారు. "నా అనుమతి ఎందుకు? తప్పకుండా వేయించండి. పెద్దవాళ్లతో పరిచయం అవుతుంది. అనుభవం వస్తుంది” అని, ఆ మాటే నాతో చెప్పారు. నేను సంతోషించాను. కథలో ఒక అందమైన ముఖం గల పటం నాయికకు చూపించి, కత్తితో వివాహం చేస్తారు. నిజానికి అతను వరుడు కాడు. శోభన మందిరంలో ఆ మాట చెబుతాడు. ఐతే, ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగులుఏదో,నిలబడిఅప్పజెప్పినట్టున్నాయని, అప్పుడు పత్రికలు రాశాయి. కావచ్చు, అంతకంటె నటించడానికి అవకాశం లేదు. పాత్రస్వభావమే అంత. జరిగిన విషయం రాజకుమార్తెకు చెప్పడంలో అలాఅప్పజెప్పినట్టుగా వుండివుండొచ్చు, ఏదిఏమైనా, ఇలాంటి విమర్శలే, పాఠాలుఅవుతాయి. తొలి నుంచి నేను విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకున్నాను. నావ్యక్తిత్వ జీవితా...