Posts

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-37"

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-37★     మంచి కథాబలం, తారాబలంతో 'దొంగరాముడు' విడుదలై - మంచి పేరు తీసుకొచ్చింది. మొదటి చిత్రంతోనే అన్నపూర్ణా సంస్థకి పేరు, స్థిరత్వం లభించాయి కె.వి.గారు కచ్చితమైన నిర్మాణ విధానం రూపొందించడంతో, మధుసూదనరావుగారు ఆ మార్గంలో, ఆ క్రమంలో తర్వాత చిత్రనిర్మాణం చెయ్యడానికి అవకాశం కలిగింది. ఒక సినిమా విజయఢంకా మోగించిందంటే అది ఎంత ఆనందం పెంచినా అంతకంటే ఎక్కువగా బాధ్యతా పెంచుతుంది. "విజయసాధన ఎంత గొప్పదో, అంత చెడ్డది కూడా" అనిపిస్తుంది నాకు. 'రోజులు మారాయి', 'అనార్కలి', 'సంతానం' మిస్సమ్మ', 'అర్థాంగి' చిత్రాలన్నీ అఖండమైన విజయాలు సాధించాయి. ఆ కోవలో వచ్చిన 'దొంగ రాముడు' అమోఘమైన విజయం సాధించింది. ఈ విజయాలు నాకు బాధ్యత పెంచినట్టే - అన్నపూర్ణా సంస్థకూ పెంచాయి. పై చిత్రాల తర్వాత వచ్చిన భలేరాముడు', 'చరణదాసి' కూడా బాగా నడిచాయి. ఐతే, 'భలేరాముడు'లో నా పాత్ర దొంగ. నెగెటివ్ పాత్ర. అంతకుముందు సదారమ'లో దొంగ పాత్ర వెయ్యడానికి నిరాకరించినవాడిని, 'భలే రాముడు' ఎందుకు ఒప్పుక

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-36★    (దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా #అన్నపూర్ణాపిక్చర్స్ #ఆవిర్భావం) నాటకాల కాలం నుంచి దుక్కిపాటి మధుసూదనరావుగారు నా హితైషి. ఎన్నో సలహాలు శ్రద్ధగా,సూచనలూ ఇస్తూ నా అభివృద్ధికి తోడ్పడిన దైవ సమానులు, పితృతుల్యులు. ఎంతో శ్రద్ధగా క్రమశిక్షణా యుతంగా నాటకసంస్థ నడిపారు. సినిమాల మీద, కథల మీద ఎంతో అవగాహన వున్నవారు. కుటుంబ సమేతంగా సర్వ ప్రేక్షకులూ సినిమాలు చూసే విధంగా మంచి కథలతో సినిమా నిర్మాణం చెయ్యాలని ఆశపడ్డారు. నవయుగ శ్రీనివాసరావు గారితో సంప్రదించారు. వారి ఊహకు నేనూ ఊపిరి పొయ్యాలని - సంస్థ ఆరంభించాము.  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,నేను చైర్మెన్,మధుసూదనరావుగారు మేనేజింగ్ డైరక్టరు. అదే - అన్నపూర్ణాపిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ అప్పటి వరకూ నేను కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో పని చెయ్యక పోయినా, ఆయన సినిమాలు.. సినిమాలు తీసే విధానం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నిర్దోషంగా స్క్రీన్ ప్లే రాయడంలో సిద్దహస్తులు, ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యాలన్న ఆశ వున్నా - మా తొలి సినిమా ఆయన చేత చేయించుకుంటే, చిత్రనిర్మాణ విధానం, పథకాలు, ఆలోచనలూ కూడా తెలుస్తాయన

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-35

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-35★   *మధ్యలో మానేసిన సినిమా* నేను షూటింగ్ చేసి, మానేసిన సినిమా ఒకే ఒక్కటి. అది 'సదారమ'. అదీ పెద్ద సంస్థయిన ఏవియమ్ వారిది. ముందుగా పాత్ర తీరు చెప్పారు. 'దొంగ' పాత్రఅది. ఏదో కాస్త నీతి, నిజాయితీ వున్న పాత్రేమో అనుకున్నాను గాని, కాదు.మూడురోజులు షూటింగ్ చేశాను. కాని, చాలా అసంతృప్తితో చేశాను. ఆ మూడు రోజులూ చాలా అవస్థపడ్డాను. ఇక లాభం లేదని, ఏవియమ్ చెట్టియార్ గారితో చెప్పాను. "ఇలాంటి పాత్ర నేను చేస్తే సినిమా ఘోరంగా దెబ్బ తింటుంది. ఈ పాత్రలో ప్రేక్షకులు నన్ను జీర్ణం చేసుకోలేరు. కళ్లకి గంతలు కట్టుకుని ఈ దొంగ పాత్రని అభినయించలేను అన్నాను. నా అభిప్రాయం విశ్లేషించి చెప్పాను. "నా వల్ల మీకు అయిన ఖర్చు తిరిగి ఇచ్చేస్తాను. నన్ను విడిచిపెట్టేయండి" అన్నాను వినయంగా, చెట్టియార్ సినిమా జ్ఞానపండితుడు. అనుభవజ్ఞుడు. శ్రేయోభిలాషి 'ఓర్ ఇరవు' తమిళ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చారు - పేరూ వచ్చింది. కాని, నాకు పొత్తు కుదరని పాత్రతో ఎలా కాపురం చెయ్యగలను చెట్టియార్ గారు ఒప్పుకోలేదు. "నువ్వు వేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-34

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-34★   పెద్దలతో పేచీలు ఐతే దర్శకులతో పేచీలు పడిన సందర్భాలు కూడా వున్నాయి. ఆంటే - 'నా మాటే నెగ్గాలి' అని కాదు. అసంతృప్తి కలిగినప్పుడు సహజంగా పేచి వస్తుంది కదా! "పరదేశి' జరుగుతున్నప్పుడు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ గారితో చిన్న వాదన జరిగింది. ఆ సినిమాలో అంజలిదేవి గారిది సానుభూతి కలిగించే పాత్ర కాదు. నాది సింపతిటిక్ పాత్ర. ప్రసాద్ గారు ఆమెకి క్లోజప్స్ తీశారు. నిజానికి నా పాత్రకి క్లోజప్స్ అవసరం అని నా ఆభిప్రాయం. ఆయన తియ్యలేదు. షూటింగ్ అయిన తర్వాత రష్ వచ్చింది. "రష్ చూదాం రావయ్యా" అన్నారు ప్రసాద్ గారు. "నేను రాను. చూడక్కర్లేదు అన్నాను పెడసరంగా, "ఏం?" అన్నారాయన. "మీరు తీసిన విధానం నాకు నచ్చలేదు. 'రాజారాణి సినిమాలో (పరదేశికి మూలమైన హిందీ సినిమా) చూశాంగదా. సానుభూతి పొందే నా పాత్రకి క్లోజప్స్ లేకపోతే దృశ్యం ఎలా రక్తి కడుతుంది?" అని అడిగాను. తర్వాత ఆయన క్లోజప్స్ తీశారనుకోండి. నిజానికి ప్రసాద్ గారెక్కడ? నేనెక్కడ? పల్నాటియుద్ధం', 'సంసారం' సినిమాల్లో ఆయన ఎలా చెబితే అలా చేసిన వాడిని, ఇప్పుడు ఎం

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-33★

Image
  ★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-33★   సెంటిమెంటల్ పాత్రలతో తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు నిర్మించిన 'బంగారు గాజులు', 'ధర్మదాత' మంచి చిత్రాలు. 'ధర్మదాత' రసభరితమైనపాత్ర. నటనకు ప్రాధాన్యం వున్న పాత్ర. ద్విపాత్రాభినయం గల చిత్రం ఇది. చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఈ రెండూ చెప్పుకోవచ్చు. నటుడు ఒక బావిలాంటివాడు. బావిలోంచి ఎంత నీరు తోడుకుంటే అంత నీరూ వస్తుంది. అలాగే, నటుడిలో వున్న శక్తిని రాబట్టుకోగలగాలి. నటించడానికి ఎన్ని విధాల రస సిద్ధి కలిగితే, అంతగా రాణిస్తాడు నటుడు. నేను ఎప్పుడూ ఆ భిన్నత్వం కోసమే ఎదురు చూసేవాడిని. సినిమాకి కథేమిటి? ఆ కథలో నా పాత్ర ఎలాంటిది? అది కథని ఎలా నడిపిస్తుంది? ఆ పాత్రని నిర్వహించడంలో నేను చెయ్యవలసిన కృషి ఏమిటి?  ఇదే నా ఆలోచన.... ఒక సినిమాకి 'దర్శకుడు' అంటే - సినిమాలో ఉన్న అన్ని శాఖల్నీసమన్వయపరిచి, కావలసింది రాబట్టే వ్యక్తి. నటీనటులందరినీ పాత్రల పరంగా నియంత్రించే వ్యక్తి. ఆ దర్శకుడు ఎప్పుడూ సమర్థుడై వుండాలి. నేను చాలామంది సమర్థులైన దర్శకుల దగ్గర పని చేశాను కాబట్టే, నాలో నిక్షప్తమైవున్న నటనాంశాన్ని బహిరంగ పరచగలిగాను. ఐత

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-32★

Image
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-32★  ఇంకొక మంచి పాత్ర ఎన్.టి.రామారావుగారు, నేనూ అప్పటికి కలిసి నటించిన చిత్రాలు పల్లెటూరి పిల్ల', 'సంసారం', 'మిస్సమ్మ'ల తర్వాత తెనాలి రామకృష్ణ' వచ్చింది. అందులో నన్ను రామకృష్ణ కవి వెయ్యమని బి.ఎస్.రంగా గారు అడిగినప్పుడు చిన్న సందేహం తలెత్తింది తెనాలి రామలింగడంటే వికటకవిగా ప్రసిద్ధుడు. ఏవేవో హాస్య చేష్టలు చెయ్యడం కవుల్నీ, కృష్ణదేవరాయల్నీ ఆట పట్టించడం లాంటివే ప్రచారంలో పున్నాయి. ఆ మాట అడిగితే, "అలాకాదు. చాలా పెద్ద తరహాలో ప్రవర్తించే పాత్రగా మలిచాము" అని పాత్ర తీరు చెప్పారు. విన్న తర్వాత మంచి ట్రీట్ మెంట్ ఇచ్చారనిపించింది. తన చాకచక్యంతో, రాజకీయ సమస్యల్ని కూడా పరిష్కరించే స్థాయిలో రామకృష్ణుడి పాత్రను తీర్చిదిద్దారు. సముద్రాల రాఘవాచార్యగారు నిండుదనంగల పాత్రగా, నటించడానికి అవకాశం వున్న పాత్రగా ఎంతో చక్కని సంభాషణలతో రూపొందించారు. చిత్రం విడుదలానంతరం రామకృష్ణుడి పాత్రకి సంపూర్ణత్వం వచ్చిందనీ, నేను చక్కగా అభినయించాననీ, పరిశ్రమలోని వారూ అభిమానులూ అందరూ అభినందించారు తెనాలి రామకృష్ణ' నా నట జీవితంలో ఒక మంచి

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

Image
  ★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-31★  హాస్య పాత్ర కాని హాస్యపాత్ర దేవదాసు'లాంటి బరువైన పాత్ర ధరించి 'మిస్సమ్మ'లో హాస్యాన్ని పలికించే పాత్ర చేశాను. ఈ పాత్రని నేనుగా కోరుకున్నది. ఇదొక విశేషం! వచ్చిన కొన్ని పాత్రల్ని నిరాకరించడం వేరు; నాకుగా రాని పాత్రని నేను చేస్తాననడం వేరు! 'మిస్సమ్మ' కథ తయారుచేసుకున్న తర్వాత, ఒకసందర్భంలో చక్రపాణిగారిని కలుసుకున్నాను. ఆయన సూక్ష్మంగా కథ వివరిస్తూ- "రెండో వేషం తమాషాగా వచ్చింది. డిటెక్టివ్ లాగా, డాబులు కొడుతూ తిరిగే పాత్ర. హాస్యపాత్ర కాదుగానిహాస్యం చిలికించే పాత్ర. హీరోకాడు గాని, హీరోకి సమమైన పాత్ర. ముఖ్యమైన పాత్ర. ఇది ఎవరి చేత వేయించాలా అని ఆలోచిస్తున్నాను” అన్నారు. నేను ఒక్క నిమిషం ఆలోచించి"మీకు అభ్యంతరం లేకపోతే నేను వేస్తాను" అన్నాను. చక్రపాణిగారు ఒక్క క్షణం అలావుండిపోయి "నువ్వా ..నువ్వు వేస్తావా?" అని అడిగారు ఆశ్చర్యానందాలు మిళాయించి. "అవును. అలాంటి సరళమైన పాత్ర చెయ్యాలని ఆశ. 'దేవదాసు' లాంటి బరువైన పాత్ర చేసిన తర్వాత, సరదాగా వుండే ఇలాంటి పాత్ర చేస్తే నాకో వెరైటీ అవుతుంది.